ఇటీవలి కాలంలో పచ్చబొట్ల ప్రాముఖ్యత పెరిగింది. అదీగాక నడుముకు పచ్చబొట్టు పొడిపించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి పచ్చబొట్టు ఉంటే ఎపిడ్యూరల్ తీసుకోవచ్చా లేదా అన్న సందేహం రావడం సాధారణమే. అయితే చాలా మంది అనస్తీషియాలజిస్టులు పచ్చబొట్టుద్వారా ఎపిడ్యూరల్ ఇవ్వడానికి సమ్మతించరు. చాలాసార్లు ఇది సురక్షితంగానే అందిస్తారు. మీరు వెళ్లిన ఆస్పత్రి అనస్తీషియాలజిస్టుతో ఈ విషయం గూర్చి చర్చించడం మంచిది. అయినా పచ్చబొట్టు భాగంలో సూది గుచ్చడంద్వారా హాని కలుగుతుందన్న ఆధారాలేవీ లేవు. సోప్ కు చెందిన పాథాలజిస్టు (వ్యధిశాస్త్ర నిపుణులు) అభిప్రాయం ప్రకారం "పచ్చబొట్టు వర్ణకాలు (పిగ్మంట్స్) చర్మంలోని అంతర కణజాలం లేదా సంధాయక కణజాలం (కనెక్టివ్ టిష్యూ) లో వదులుగా ఉండవు. కానీ గాయం మానే దశలో భక్షక కణాలతో (మాక్రోఫేజ్ కణాలు) కలిసిపోతాయి. ఈ వర్ణక మాక్రోఫేజ్ లు చర్మ కణజాలంలో అలాగే నిలిచిపోతాయి. పచ్చబొట్టులో ఉపయోగించిన వర్ణక పదార్థ పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ వర్ణకలు ఫినాఫ్తలీన్ నిర్మాణాలకు చెందిన వివిధ రకాల జడలోహ లవణాలతో తయారై ఉంటాయి. కాబట్టి చాలావరకు అలర్జీ సమస్యలుండవు. అందువల్ల పచ్చబొట్టు ఉన్న భాగం ద్వారా వెన్నుపూస వెలుపలి పొర ప్రదేశం(ఎపిడ్యూరల్ స్పేస్)లోకి సూది పంపడంపట్ల ఎటువంటి భయం అవసరం లేదు. ఎందుకంటే వర్ణక సంబంధమయిన పదార్థాలు ఆ చర్మ కణజాలంతోనే స్థిరంగా ఉండిపోతాయి. సూదిద్వారా ప్రయాణించి రాలేవు. కాబట్టి పచ్చబొట్టుద్వారా సూది ఇచ్చినా ఏ ప్రమాదమూ ఉండదు.
మరింత సమాచారం కోసం
http://www.soap.org/media/newsletter summer 2001.pdf
http://tatto.about.com/b/a/018306.htm