వెన్నుముకకు మత్తు ఇవ్వడం (ఎపిడ్యూరల్ అనల్జీసియా) వల్ల ప్రసూతి సమయం కొంతవరకు పొడిగింపబడుతుంది గాని సిజేరియన్ అవకాశం పెరుగుతుందన్నది మాత్రం సబబు కాదు.
- ఐవి పద్ధతి ద్వారా ఉపశమనం పొందిన వారికన్నా ఎపిడ్యూరల్ తీసుకున్నవాళ్లలో ప్రసూతి కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ తేడా సుమారుగా ఒక గంట ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ప్రసూతి విధానాన్ని బట్టి ఇది రకరకాలుగా ఉండవచ్చు.
- ఎపిడ్యూరల్ అనల్జీసియా వల్ల సిజేరియన్ అవకాశాలు పెరగవు. చాలా అధ్యయనాలు దీన్ని బలపరుస్తున్నాయి.
- ఎపిడ్యూరల్ అనల్జీసియా, ఫోర్సెప్స్ ప్రసవాలకు మధ్య ఉన్న సంబంధం చాలా సంక్లిష్టమైనది. ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్లలో ఎక్కువగా ఫోర్సెప్స్ ప్రసవాలే అవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రసూతి వైద్యులు అనుసరించే విధానాల పైన ఈ విషయం ఆధారపడి ఉంది.
- ఐవి పద్ధతిలో కన్నా ఎపిడ్యూరల్ ద్వారా గర్భిణి ఎక్కువ సంత్రుప్తిగా ఉండడమేగాక శిశుజననం కూడా మరింత సులువుగా జరుగుతుంది.