www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth


ప్రసూతి సమయంలో చాలామంది తల్లులు స్పర్శ, మర్దనవల్ల ఉపశమనం కలుగుతుందంటారు. ఇది అందించేవాళ్లు సాధారణంగా వారికి అత్యంత ఆత్మీయులై ఉంటారు. అయితే స్పర్శ, మర్దనలవల్ల కలిగే లాభం గురించి ఎక్కువ అధ్యయనాలేవీ లేదు. కాని నీటివల్ల భావోద్రేకాల నుంచి శారీరకంగా కొంతవరకు ఉపశమనం కలుగుతుందన్నది మాత్రం స్పష్టమయింది.

ప్రక్రియ విధానం

ఆప్యాయ పూరితమైన చేతి స్పర్శ, లాలన, ప్రేమతో కూడిన మర్దన, తల నిమరడం, జుట్టు సవరించడం వంటి అంశాలు చికిత్స పరమైన స్పర్శ, మర్దనల్లో చోటుచేసుకుంటాయి. చేతులు, వేలికొసలేగాక నొప్పి పోగొట్టడానికి శరీరంపై కొంత ఒత్తిడి కలుగ చేసే ప్రత్యేక పరికరాలను ఇందుకోసం ఉపయోగిస్తారు.

ఆహ్లాదాన్ని పొందడం, ఉద్రేకాలను తగ్గించుకోవడం ద్వారా తల్లులు నొప్పి నుంచి ఉపశమనం పొందగలుగుతారు. శిశువు తలభాగం ఉండే వెన్ను కిందిభాగంలో చాలామందికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశంలో మర్దన చేయడంవల్ల చాలావరకు నొప్పి నుంచి బయటపడతారు. ఒత్తిడి తగ్గించడం, నొప్పి గురించి ఆలోచన లేకుండా చేయడం లేదా ఇతర గ్రాహకాలను ఉత్తేజం చేయడం ద్వారా ఈ పద్దతిలో ఉపశమనం కలుగుతుంది.

పరిమితులు

పద్దతిని ఉపయోగించడంవల్ల నొప్పి నివారక మందుల వాడకం తగ్గుతుందన్న దాఖలాలు లేవు. మర్దన వల్ల 30 నిమిషాల వరకు నొప్పి తెలియకుండా ఉంటుంది. కాబట్టి 30 నిమిషాలకు ఒకసారి మర్దన చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పైన తెలిపిన సమాచారం దిగువ సూచించిన ప్రచురణల నుంచి స్వీకరించడమైనది. స్పర్శ, మర్దనల గురించి మరింత సమాచారం కావాలనుకుంటే ఇవి చదువుకోవడంతోపాటు మీ ప్రసూతి వైద్యులతో చర్చించండి.

Simkin P., Nonpharmacologic relief of pain during loabor: Systematic reviews of five methods, Am J Obstet genecol, 2002 Volume 186, Number 5, S131-159.

Murray Enkin, A Guide to Effective Care in Pregnancy and Childbirth, 3rd Ed., Oxford University Press, 2000


 

తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి

Copyright © 2018 - Bhavani Shankar Kodali MD