నొప్పుల సమయంలో గర్భాశయం వ్యాకోచిస్తుంది. గర్బాశయంలో కలిగే మార్పు నాడీ వ్యవస్థ ద్వారా వెన్నెముక నుంచి(చిత్రపటంలో చూపించిన విధంగా) మెదడుకు చేరి, నొప్పిగా బయటకి తెలుస్తుంది. |
ఒక్కో మహిళకు నొప్పులు ఒక్కో విధంగా వస్తాయి. ఎవరి అనుభవం వారిదే. నొప్పి తీవ్రత ఎలా ఉంటుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:
నొప్పులు మొదలయ్యేవరకు బాధ ఎంత తీవ్రంగా ఉండబోతున్నదన్నది అంచనా వేయడం కష్టం. కొందరిలో బాధ సహనీయంగా ఉండవచ్చు. కొందరిలో నియంత్రించడానికి వీలుండవచ్చు. చాలా మంది బాధా నివారణ చర్యలకు ఉపక్రమించవచ్చు. శ్వాస పీల్చుకోవడం, వెచ్చని నీటిలో కూర్చోబెట్టడం, మర్దన చేయడం, గర్భిణులతో రకరకాల విన్యాసాలు చేయించడం(నిలబడడం, కూర్చోబెట్టడం, నడిపించడం) వంటి వైద్యేతర చికిత్సలు కూడా నొప్పుల సమయంలో బాధా నివారణకు ఉపయోగపడతాయి. ప్రసూతి వైద్య నిపుణులు ఈ విషయంలో మీకు మరింత సమాచారాన్ని అందించగలరు. అయితే చాలామందికి ఈ తరహా చికిత్సలు చాలవు. |
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి