Ideal positions for epidural placement |
ఎపిడ్యూరల్ తీసుకునే సమయంలో వెన్ను కిందిభాగాన్ని కొంచెం పైకి కనిపించే విధంగా వెన్నుపామును విల్లులా వంచి ఉంచాలి. ఇదే సరైన ఐడియల్ పొజిషన్. ఈ స్థితిని వివరించడానికి చాలారకాల ఉపమానాలు వాడుతుంటారు. ఆంగ్ల అక్షరం సి, రొయ్యలాగా, కోపంతో ఉన్న పిల్లిలా, నడుము భాగాన్ని(పెల్విస్) వంచి ఉంచడం ఎన్నో పదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దిగువ ఇచ్చిన బొమ్మలు చూస్తే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆస్పత్రికి రాకముందే ఇంట్లో ఇది సాధన చేయడం మంచిది. సరైన స్థితిలో ఉన్నప్పుడు ఎపిడ్యూరల్ ఇవ్వడం మరింత సులభతరం అవుతుంది. |
కూర్చోనే స్థితి
|
వెన్నుపామును పైకి కనిపించేలా వంచి ఉంచడంతోపాటు మీ రెండు భుజాలూ ఒకేరీతిగా వంచి గడ్డాన్ని కిందకి దించండి. ఒకటి కిందకీ, మరోటి పైకీ కాకుండా రెండు భుజాలూ సమంగా ఉండాలి |
|
మంచంపై పడుకున్నప్పుడు మీ ముందుపైపు ఉండాల్సిన తీరు వెన్నుపామును వంచడంతోపాటు మీ రెండు భుజాలూ ఒకేరీతిగా వంచి గడ్డాన్ని కిందకి దించండి.
|
|
ఎపిడ్యూరల్ ఇవ్వడానికి ఈ స్థితులు ఎలా ఉపయోగపడతాయి. ఇది తెలుసుకోవడానికి దిగువ ఇచ్చిన బొమ్మలు చూడండి. |
పైన చెప్పిన విధంగా వెన్నెముకను విల్లులా వంచడంవల్ల వెన్నుపాము ఎముకల మధ్య స్థలం విశాలమవుతుంది. దీనివల్ల సూదిని సులభంగా పంపించడానికి వీలుకలుగుతుంది |
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి |