www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth




ఎపిడ్యూరల్ ఇచ్చేటప్పుడు నేనెలా ఉండాలి? అనే విభాగంలోని బొమ్మలో చూపిన విధంగా ఒక వైపు తిరిగి పడుకుని సాధ్యమైనంత వరకు వెన్ను భాగాన్ని ముందువైపుకు వంచాలి. వెన్నుముక కింది భాగంలో ఎముకల మార్కింగ్ లను అనస్తీSఇయాలజిస్టు గుర్తించి ఆ ప్రదేశాన్ని యాంటిసెప్టిక్ ద్రావణంతో ముందుగా శుభ్రపరుస్తాడు. తరువాత చర్మాన్ని మొద్దుబారేటట్టు చేయడానికి చాలా తక్కువ పరిమాణంలో లోకల్ అనస్తెటిక్ ఇస్తారు. ఆ తరువాత ఖాళీగా ఉన్న ఎపిడ్యూరల్ సూదిని గుచ్చుతారు. ఆ సూది వెన్నెముక వెలుపలి పొర వరకు వెళ్లిన తరువాత ఓ చిన్న ప్లాస్టిక్ ట్యూబును (క్యాథెటర్) ఆ సూది గుండా ఎపిడ్యూరల్ స్పేస్ లోకి పంపిస్తారు. కొంతమందిలో క్యాథెటర్ ను పంపించినప్పుడు కాళ్లకు విద్యుత్తు తగిలినట్టుగా చిమచిమలాడుతూ మంటగా ఉంటాయి. ఎపిడ్యూరల్ స్పేస్ లోకి వెళ్లేటప్పుడు క్యథెటర్ న్యూరాన్లకు తగలడం వల్ల ఇలా జరుగుతుంది. అయినా ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి అలాంటి స్థితి కొద్దిసేపే ఉంటుంది. క్యాథెటర్ సరైన స్థానంలోకి చేరగానే సూదిని తీసివేస్తారు. క్యాథెటర్ మాత్రం వెన్నెముకలో అలాగే ఉండిపోతుంది. మొట్టమొదట ఇవ్వాల్సిన మందును క్యాథెటర్ లోకి ఎక్కిస్తారు. తరువాత బిడ్డ పుట్టేవరకూ మందులను ఇస్తుండాలి. గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం నుంచి నాడులు ఈ ఎపిడ్యూరల్ స్పేస్ లోకే వస్తాయి. దీనిలోకి పంపించిన మందులో ఆ నాడులు మునిగిపోవడం వల్ల నొప్పి తెలియకుండా ఉంటుంది.

ఎపిడ్యూరల్ ప్రక్రియ పూర్తవడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఎపిడ్యూరల్ స్పేస్ లో ఉంచిన మందులు పనిచేయడానికి మరో 15 - 20 నిమిషాలు తీసుకుంటుంది. దీనివల్ల నొప్పుల తీవ్రత చాలా తక్కువగా ఉండడమేగాక చాలా త్వరగా పోవడం చాలామంది మహిళల్లో గమనించవచ్చు. అయితే కండరాలు సంకోచం చెందేప్పుడు కొంచెం ఒత్తిడికి మాత్రం గురవుతారు. ఇది అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD