www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

స్నానం ప్రసూతి నొప్పులు తగ్గిస్తుందని చాలా మంది గర్భిణులు భావిస్తుంటారు. ఆస్పత్రితో నిమిత్తం లేకుండా చాలా మంది తల్లులు ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. కొన్ని ఆస్పత్రులు స్వయంగా స్నానం చేసే వసతులు కల్పించడమో, లేక కుటుంబ సభ్యులు తెచ్చే స్నాన సామాగ్రిని అనుమతించడమో చేస్తుంటాయి.

టెక్నిక్

నొప్పులు క్రియాశీల దశకు చేరుకోగానే గర్భిణిని స్నానాలు చేసే వేడినీటి టబ్బులో దింపుతారు. టబ్బులో నీరు శరీర ఉష్నోగ్రతకు మించకుండా ఉంచుతారు. రొమ్ములవరకు నీరు నింపుతారు. శరీరం బిగుసుకుపోకుండా ఊరటపొందడానికి ఇది దోహదం చేస్తుంది.

వ్యవధి

గంట నుంచి గంటన్నర సమయం నీరిలో స్నానమాడిన మహిళల్లో నొప్పులు తక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. ఎక్కువసేపు ఉన్నంత మాత్రాన నొప్పి తగ్గాలని లేదు. పైగా తల్లి శరీరంలో ఉష్ణోగ్రత, శిశువుకు కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది.

పరిమితులు:

• గర్భాశయంలోని శిశువు ఉష్ణోగ్రత తల్లి ఉష్ణోగ్రత కంటే సుమారు ఒక సెంటీగ్రేడు ఎక్కువగా ఉంటుంది. తల్లి ఎక్కువసేపు వేడినీళ్లలో ఉంటే శిశువు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ నీరి ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ లకు మించరాదు. అంతేకాదు స్నాన సమయం రెండు గంటలలోపే ఉండేట్టు చూడాలి.

• ప్రసూతి సమయానికి ముందే పొర దెబ్బతిన్న తల్లుల్లో స్నాన చికిత్స వల్ల ఇన్ ఫెక్షన్ పెరిగే అవకాశాలు కనిపించలేదు. రోగనిరోధకాల అవసరం పెరగలేదు.

గర్భాశయ పొర దెబ్బతిన్న తల్లుల్లో స్నానచికిత్స వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంలో మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది.

పైన పేర్కొన్న సమాచారాన్ని దిగువ సూచించిన అధ్యయనం నుంచి తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకోసం ఈ పత్రాన్ని చూడడంతోపాటు మీ డాక్టరును సంప్రదించగలరు:

http://www.parentsplace.com/pregnancy/labor/articles/0,,239070 114897,00.html

సింకిన్ పి,నాన్ ఫార్మాకాలాజిక్ రిలీఫ్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ లేబర్: సిస్టమిక్ రివ్యూస్ ఆఫ్ ఫివ్ మెథడ్స్, ఎ ఎం జె ఆబ్ స్టెట్ గైనకాల్, 2002 వాల్యూమ్ 186, నంబరు 5, ఎస్131-159

ఓడెంట్ ఎం:వాటర్ బర్త్: వాట్స్ నెక్స్ట్. ఎలక్ట్రానిక్ రెస్పాన్స్ టు: పెరినాటల్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అమాంగ్ బేబీస్

డెలివర్డ్ ఇన్ వాటర్: సర్వీయలెన్స్ స్టడీ అండ్ పోస్టల్ సర్వే వివరాలకు సంప్రదించండి: www.bmj.com

ఓడెంట్ ఎం: కెన్ వాటర్ ఇమ్మర్షన్ స్టాప్ లేబర్? జె నర్స్ మిడ్ వైఫరీ 1997; 42:414-16

తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి

 


Copyright © 2018 - Bhavani Shankar Kodali MD