ఎపిడ్యూరల్ అనల్జీసియా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

భవానీ శంకర్ కొడాలి ఎం.డి

ఎపిడ్యూరల్ సమయంలో ప్రసవం నొప్పి ఉపశమన పర్యవేక్షణ

ఇంతకుముందు చెప్పినట్లుగా మొదట ఇచ్చే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ తో కొంతవరకు సౌకర్యం చేకూరగానే ఎపిడ్యూరల్ పంపును అమర్చుతారు. మందును అందిస్తూ ఉంటుంది. అయితే ఎపిడ్యూరల్ పంపు ద్వారా తనంతటతానుగా అందే మత్తుమందు కూడా సరిపోక ఒక్కొక్కసారి అసౌకర్యభావన కలుగవచ్చు. వెన్నుపూస వెలుపలిపొర(ఎపిడ్యూరల్) ద్వారా అదనంగా మందులు ఇస్తూ నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియాలజిస్టు ప్రయత్నిస్తాడు. శిశు జననం జరిగేవరకూ ప్రసూతి నర్సు, అనస్తీషియాలజిస్టు మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు.

 

Click on the 'Play button' for viewing the animation

Click here for the next item