కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా (సి ఎస్ ఇ)

భవానీ శంకర్ కొడాలి, ఎం.డి

సాధారణ్ ఎపిడ్యూరల్ ప్రక్రియ(వెన్నుముక వెలుపలి పొరకు ఇచ్చే మత్తు) కన్నా కంబైన్డ్ ఎపిడ్యూరల్ అనస్తీషియా విధానం ద్వారా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. అన్ని రకాల విధానాల ఉపయోగాలను ఈ ఒక్క ప్రక్రియ ద్వారానే పొందవచ్చు.

  • ఈ విధానంలో మత్తుమందు చాలా వేగంగా పనిచేస్తుంది.
  • తీవ్రమైన నొప్పి కూడా తెలియకుండా పోతుంది.
  • కాళ్లు కదిలించడం వల్ల జరిగే హానిని బాగా తగ్గించవచ్చు.
  • ఇచ్చిన మందు శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లదు. కాబట్టి గర్భస్థ శిశువుకు కూడా చేరే అవకాశం తక్కువ.
  • నొప్పి తీవ్రత ఉండదు కాబట్టి తల్లికి హాయిగా ఉంటుంది

 

కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా (సి ఎస్ ఇ) విధానం

Click on the 'play button' to begin viewing the procedure. The frames will change automatically.

ఎపిడ్యూరల్ అనస్తీషియాలో వివరించినట్టుగా సి ఎస్ ఇ విధానంలో కూడా ముందుగా వెన్నుపూస వెలుపలి పొర ఎక్కడ ఉందో గుర్తించాలి. తరువాత ఆ పొర ద్వారా ఎపిడ్యూరల్ సూదిని ఉపయోగించి వెన్నుముక పొరల మధ్య ఉండే ద్రవం (స్పైనల్ ఫ్లూయిడ్) లోకి మందును పంపిస్తారు. దీన్నే స్పైనల్ అనస్తీషియా అంటాం. దీనివల్ల మెల్లమెల్లగా నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇప్పుడు ఎపిడ్యూరల్ సూదిని తీసివేసి దాని స్థానంలో ట్యూబు మాదిరిగా ఉండే ఎపిడ్యూరల్ క్యాథెటర్ ను అమరుస్తారు. ఈ క్యాథెరర్ ఎపిడ్యూరల్ స్పేస్ లోకి చేరగానే దాన్ని అక్కడే ఉంచి సన్నని సూదిని మాత్రం తీసివేస్తారు. ఎపిడ్యూరల్ అనస్తీషియాలో మాదిరిగానే ఎపిడ్యూరల్ ట్యూబు ద్వారా మెల్లమెల్లగా మందును పంపిస్తారు. సాధారణంగా 90 నిమిషాల కల్లా కంబైన్డ్ ఎపిడ్యూరల్ అనస్తీషియా ప్రభావం పోతుంది. మత్తుమందు పనిచేయడం ప్రారంభం కాగానే నొప్పి లేకుండా సౌకర్యంగా ఉంటుంది. ప్రసవం అయ్యేవరకు తగిన మోతాదులో మందులను ఇవ్వాల్సి ఉంటుంది.

Click below for the next item