రోగి నియంత్రిత ఎపిడ్యూరల్ అనల్జీషియా

డేవిడ్ హెప్నర్ ఎం.డి, అసిస్టెంట్ ప్రొఫెసర్
భవానీ శంకర్ కొడాలి ఎం.డి, అసిస్టెంట్ ప్రొఫెసర్

ఎపిడ్యూరల్ తీసుకున్నా ఇంకా అసౌకర్యంగా ఉన్నప్పుడు అదనపు మందును ఎపిడ్యూరల్ తో కలిపి ఇవ్వడానికి 'రోగి నియంత్రిత ఎపిడ్యూరల్ అనల్జీసియా' ఉపయోగపడుతుంది. నొప్పి పెరగకుండా స్థిరమైన ఉపశమనం కలుగడానికి ఇది సహాయపడుతుంది. పంపుదగ్గరినుంచి తాళ్లద్వారా ఏర్పరచిన స్విచ్ మీకు అందుబాటులో ఉంటుంది. అవసరం అయినప్పుడు అదనపు మందును మీకు మీరే తీసుకోవచ్చు. మందు అధిక మోతాదులో వెళ్లకుండా ఉండేందుకు ఇన్ ప్యూజన్ పంప్ లో అనస్తీషియాలజిస్ట్ కొన్ని పరిమితులను ఏర్పరచి ఉంచుతాడు. వెన్నుపూస వెలుపలి పొరకు ఇచ్చే మత్తు (ఎపిడ్యూరల్)కు పొడగింపుగా కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనల్జీసియాను ఇస్తారు. అదేవిధంగా నిరంతరంగా ఇచ్చే ఎపిడ్యూరల్ అనల్జీసియాకు పొడగింపుగా రోగి నియంత్రిత ఎపిడ్యూరల్ అనల్జీసియా (పిసిఇఎ) పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు. నిరంతర ఇన్ ప్యూజన్ పద్దతిలాగాతా పిసిఇఎ విధానంలో కూడా అతి తక్కువ మోతాదు మందు సైతం అంతే ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కాళ్లు, పాదాల తిమ్మిరి కూడా తక్కువగా ఉంటుంది. సులభంగా ఉపయోగించగలగడం, ఫిజిషియన్ జోక్యం తక్కువగా ఉండడం, చాలామంది దీనివల్ల సంత్రుప్తికరంగా ఉండడంవల్ల గత కొన్నేళ్లుగా పిసిఇఎ విధానానికి ప్రాధాన్యం పెరిగింది. అంతేగాక దీనివల్ల నొప్పి తగ్గడానికి మీకు ఎంత మందు కావాలో అంత వరకు మందు తీసుకోవడం పూర్తిగా మీ నియంత్రణలోనే ఉంటుంది.

 

Click below for the next item