ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించే విధానాల పరిణామక్రమం

భవానీ శంకర్ కొడాలి, ఎండి

Click on the button

గత దశాబ్దం వరకు ప్రసవం అంటే చాలా బాధాకరమైన విషయంగా ఉండేది. ప్రాణాంతకమైనదిగా భయపడేవాళ్ళు. 1800 సంవత్సరంలో మత్తుమందును కనుక్కునేవరకు ఈ పరిస్థితి కొనసాగింది. ఈథర్, క్లోరోఫామ్ లు మంచి మత్తుమందులుగా పనిచేస్తాయని, ప్రసవ సమయంలో వీటిని ఇవ్వవచ్చన్న పరిశోధనలు విజయవంతం కాగానే బ్రిటన్ లోని క్రైస్తవ మతాధిపతుల్లో కలకలం చెలరేగింది. దేవుని స్రుష్టికి వ్యతిరేకంగా పనిచేసే ఈ పరిశోదన మహాపాపమంటూ శాస్త్రజ్ణులపై ధ్వజమెత్తారు. ప్రసవ సమయంలో నొప్పి ఉండకూడదని అనుకుంటే దేవుడు అలాగే స్రుష్టించి ఉండే వాడంటూ వాదించారు. బోస్టన్ లోని మసాచుసెట్స్ జనరల్ హస్పిటల్ లో మొట్టమొదటి సారిగా ప్రసవ సమయంలో ఆధునిక అనస్తీషియా ఉపయోగించారు. పెల్విస్ లోపంతొ ఉన్న ఒక మహిళ ప్రసవించే ముందు జేమ్స్ యంగ్ సింప్సన్ డై ఇథైల్ ఈథర్ ను మత్తుమందుగా ఆమెపై ప్రయోగించారు. విక్టోరియా మహారాణి కూడా ఈ మత్తుమందును వాడడంతో మతాదికారుల ఆశలన్నీ పటపంచలయ్యాయి. ప్రసవ సమయంలో మత్తుమందు తీసుకున్న తొలి మహిళ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫానీ లాంగ్ ఫెలో. అమెరికాలోని ప్రసిద్ధ కవి హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో భార్య. ఓ సందర్బంలో ఆమె ఇలా రాశారు..

"ఈథర్ ను తీసుకోవడం వల్ల నేనేదో చేయరాని పని చేసినట్టు చాలామంది భావించారు. కాని నా భర్త హెన్రీ సహకారం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. విదేశాల్లో డాక్టర్లు మతాదికారులకు వ్యతిరేకంగా పోరాడి మరీ దీన్ని విజయవంతం చేశారనే విషయం విన్నాను.....నిజంగా ఇది ఒక గొప్ప వరం."

నొప్పిలేని ప్రసవం విజయవంతం అయిన తరువాత ప్రజలు రెండు రకాలుగా విడిపోయారు. మత్తుమందు వాడాలని కొందరు, అందుకు వ్యతిరేకంగా మరికొందరు. వ్యాధులు, కరవుకాటకాలు, పేదరికం, నొప్పుల బాధలు.. ఇవన్నీ మనం చేసిన పాపాలకు ప్రథిఫలం అనుభవించడానికి ఆ విధాత ఏర్పరచినపని మత్తుమందును వ్యతిరేకించేవాళ్లు నమ్మేవారు. క్రైస్తవ మతగ్రంథం ప్రకారం ఈడెన్ తోటలో తన మాటను లెక్కచేయకుండా ప్రవర్తించినందుకు ఈవ్ కు దేవుడు విధించిన శిక్షలో ప్రసవ వేదన కూడా ఒక భాగం. కాబట్టి నొప్పి లేకుండా చేయాలని ప్రయత్నించడం దేవుని శాసనాన్ని ధిక్కరించడమేనన్నది వారి ప్రగాఢ విశ్వాసం.వ్యాధులు, నొప్పుల బాధలనేవి జీవక్రియల్లో లోపాలకు సంబంధించినవనీ, వాటిని పరిజ్ణానం ద్వారా పోగొట్టవచ్చన్నది మరో విభాగం వారి నమ్మకం. వైద్యనిపుణుల్లో సైతం ఇలా రెండు రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నవాళ్లు ఉండడం విశేషం.

మత్తుమందును ఇవ్వడాన్ని సమర్థించిన వారిలో ఇద్దరు మేధావులు కూడా ఉన్నారు. అందులో ఒకరు 19వ శతాబ్దానికి చెందిన జాన్ స్టూవర్ట్ మిల్ అనే సామాజిక తత్వవేత్త. 'ప్రక్రుతిలోని బాధించే శక్తులు మంచినే చేస్తాయి. బుద్ధిజీవులు మేలుకుని తమకు వ్యతిరేకంగా పోరాడేలా అవి ప్రేరేపిస్తాయి' అని అంటారాయన. మరో మేధావి జేమ్స్ యంగ్ సింప్సన్ అనస్తీషియాకు మద్దతు ప్రకటించడమే కాదు, అనస్తీషియాకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం అవసరమని అన్నారు. ఇది ఆయన ప్రత్యర్థులకు నచ్చలేదు. తొలి దశలో ఆయన ఒకసారి ఇలా అన్నారు.

"వైద్యరంగంలో ఉన్నవాళ్లు కూడా ప్రసవ సమయంలో అనస్తీషియా తీసుకోవడాన్ని అర్థరహితంగా వ్యతిరేకిస్తారు. రోగులే మత్తుమందు తీసుకోవలసిన అవసరాన్ని మన వ్రుత్తిపై రుద్దుతారు. సమస్యంతా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నదే'

ఇలా ఆయన చెప్పిన జోస్యమే కొన్నేళ్ల తరువాత నిజమయింది. ప్రసవంకోసం అనస్తీసియా ఇవ్వడం అన్నది బాగా పెరిగిపోయింది. అన్ని సమస్యలు, అనుమానాలు తొలగిపోయి, అనస్తీసియా అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు.

అనేక సామాజికాంశాల విషయంలో వచ్చినట్టుగానే అనస్తీసియా విషయంలో కొన్ని శతాబ్దాలుగా ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి. నొప్పుల సమయంలో అనస్తీసియాను ఉపయోగించడం పెరిగింది. శిశుమరణాల రేటు తగ్గిపోయింది. నొప్పులు లేనప్పుడు శిశువును క్షేమంగా బయటకి తీయడం డాక్టరుకు లేక మిడ్ వైఫ్ కు తేలికవుతుంది. అమెరికన్ అబ్స్టెరిక్ అండ్ గైనకాలజీ కళాశాల ఈ అభిప్రాయాలనే ధ్రువీకరిస్తున్నది-

'నొప్పుల సమయంలో గర్భిణులు భరింపశక్యం కాని బాధకు గురవుతున్నారు. ఇతర ఏ సందర్భంలోనూ ఇంతటి బాధను చూస్తూ ఊరుకోరు. డాక్టరు జోక్యంతో చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. తల్లికోరితే చాలు నొప్పుల సమయంలో ఈ బాధనుంచి ఉపశమనం కలిగించడానికి డాక్టరు జోక్యం చేసుకోవచ్చు'.

గత దశాబ్ద కాలంగా ఎంతోమంది పరిశోధకులు, ఫిజీషియన్లు, మందుల తయారీ సంస్థలు, వృత్తి సంస్థల నిరంతర పరిశ్రమ వల్ల గర్భిణులకు ప్రసూతి అనస్తీషియా సురక్షితమైనదేనని స్పష్టం అయింది. ప్రసవ సమయంలో నొప్పి లేకుండా శిశుజననం జరగడం ఒక ఆనందమయ ఘటనగా, తీపిగుర్తుగా నిలిచిపోవడానికి ఈ పరిశోధనలు దోహదం చేశాయి.

భవానీ శంకర్ కొడాలి ఎండి

మరింత అవగాహన కోసం:
1. హిస్టరీ ఆఫ్ అబ్స్టెట్రిక్ అనస్తీషియా. ఇన్ అబ్స్టెట్రిక్ అనస్తీషియా. చెస్ట్ నట్ డిహెచ్. మోస్బీ; 1999.
2. ద వర్క్ ఆఫ్ సర్ జెవై.సింప్సన్..వాల్యూమ్ II .ఎడిటర్: సింప్సన్ డబ్ల్యుజి. ఆడమ్ అండ్ చార్లెస్ బ్లాక్, 1871.
3. మిసెస్ లాంగ్ ఫెలో. సెలక్టెడ్ లెటర్స్ అండ్ జర్నల్స్ ఆఫ్ ఫ్యామిలీ అపిల్ టన్ లాంగ్ ఫెలో (1817-1861): ఎడిటర్: వ్యాగెన్ నెట్, ఇ.లాంగ్ మన్స్, గ్రీన్స్, 1956.

 

Click below for the next item