ప్రసవ సమయంలో నొప్పి

భవానీ శంకర్ కొడాలి ఎండీ, అసోసియేట్ ప్రొఫెసర్

నొప్పుల సమయంలో గర్భాశయం వ్యాకోచిస్తుంది. గర్బాశయంలో కలిగే మార్పు నాడీ వ్యవస్థ ద్వారా వెన్నెముక నుంచి(చిత్రపటంలో చూపించిన విధంగా) మెదడుకు చేరి, నొప్పిగా బయటకి తెలుస్తుంది.

Click on the play button

ఒక్కో మహిళకు నొప్పులు ఒక్కో విధంగా వస్తాయి. ఎవరి అనుభవం వారిదే. నొప్పి తీవ్రత ఎలా ఉంటుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  • శిశువు పరిమణం
  • గర్భాశయంలో శిశువు స్థితి(పొజిషన్)
  • కటి నిర్మాణం, విస్త్రుతి
  • వ్యాకోచం ఎంత తీవ్రంగా ఉంది
  • మీ గతానుభవం, ప్రస్తుత అంచనాలు
  • ఇంకా అనేక అంశాలు

నొప్పులు మొదలయ్యేవరకు బాధ ఎంత తీవ్రంగా ఉండబోతున్నదన్నది అంచనా వేయడం కష్టం. కొందరిలో బాధ సహనీయంగా ఉండవచ్చు. కొందరిలో నియంత్రించడానికి వీలుండవచ్చు. చాలా మంది బాధా నివారణ చర్యలకు ఉపక్రమించవచ్చు. శ్వాస పీల్చుకోవడం, వెచ్చని నీటిలో కూర్చోబెట్టడం, మర్దన చేయడం, గర్భిణులతో రకరకాల విన్యాసాలు చేయించడం(నిలబడడం, కూర్చోబెట్టడం, నడిపించడం) వంటి వైద్యేతర చికిత్సలు కూడా నొప్పుల సమయంలో బాధా నివారణకు ఉపయోగపడతాయి. ప్రసూతి వైద్య నిపుణులు ఈ విషయంలో మీకు మరింత సమాచారాన్ని అందించగలరు. అయితే చాలామందికి ఈ తరహా చికిత్సలు చాలవు.

Click below for the next item