ప్రసవ సమయంలో నొప్పి తీవ్రత

భవానీ శంకర్ కొడాలి, ఎండి

ప్రసూతి సమయం అయ్యేవరకు ఎంత మోతాదులో నొప్పి ఉంటుందన్నది నిర్ధారించడం చాలా కష్టం. కొంతమంది మహిళలు కొంతవరకు నొప్పిని భరించగలిగే శక్తి కలిగి ఉండవచ్చు. మరికొందరు ఇతర మార్గాల ద్వారా నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. మందులు అవసరం లేకుండా గాలి పీల్చి వదలడం వంటి రిలాక్సేషన్ పద్దతులు, గోరువెచ్చని నీటిస్నానం, మర్దన లాంటి అనేక విధానాలు నొప్పిని తగ్గించడానికి అందుబాటులో ఉన్నయి. నర్సుల అదనపు సహకారం, నిల్చోవడం, కూర్చోవడం, నడవడం వంటి కదలికల స్థానాలకు మార్చడం ద్వారా లేడా ప్రసూతి బంతులను ఉపయోగించి కూడానొప్పినుంచిఉపశమనంకలిగించవచ్చు. ఇలాంటి పద్దతులు నొప్పిని తగ్గించడమేగాక ప్రసవాన్ని ఒక ఆనందకరమైన అనుభవంగా భావించడానికి తోడ్పడుతాయని సిద్ధాంతీకరించారు కూడా. ఈ పద్దతుల గురించిన పూర్తి సమాచారం కోసం ఆయా వెబ్సైట్లను చూడవచ్చు. శిశు జనన శిక్షకులు కూడా తగిన సమాచారాన్ని అందించగలుగుతారు.

నొప్పి ఉపశమించడానికి కొంతమంది మహిళలు మందులను కూడా ఆశ్రయిస్తారు.

 

Click below