ప్రసూతి సమయంలో కొన్నిరకాలుగా కదలడం, పడుకోవడంవల్ల ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. 1900 సంవత్సరం నుంచి ఇంటిలో కాకుండా ఆస్పత్రిలో వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ఇంట్రావీనస్ లైన్స్, ఎపిడ్యూరల్ వంటి విధానాల సహాయంతో ప్రసవించడానికి ముందుకొస్తున్నారు. దీనివల్ల ప్రసూతి గర్భిణుల కదలికలకు పరిమితులు ఏర్పడ్డాయి. తల్లి తను స్థానాన్ని మార్చుకున్నప్పుడు బిడ్డ తల ఉండే స్థానం, గర్భాశయ సంకోచాలు, పెల్విస్ భాగం గురుత్వాకర్షణలలో మార్పులు కలుగుతాయి. కడుపులో శిశువు సరైన స్థానంలో ఉండడానికి, ఏటవాలుగా ముందుకు కదలడం కోసం ప్రసూతి సమయంలో తల్లి స్థానచలనంలో మార్పులను సూచిస్తారు. నడవడం, నిటారుగా కూర్చోవడం వంటి కదలికలవల్ల ప్రసవ వేగం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
-
నమూనా స్థితులు (నమూనా పొజిషన్లు)
-
నిటారుగా కూర్చోవడం
-
కాలిమడమల మీద కూర్చోవడం
-
పక్కకు ఒరిగి ఉండడం
-
వెల్లకిలా పడుకోవడం
-
చేతులు, మోకాళ్ల కదలికలు
ఇటీవల వచ్చిన బర్తింగ్ బాల్స్ (జనన బంతులు) ప్రసూతి సమయంలో మరింత సౌకర్యాన్ని ఇస్తాయి. గుండ్రంగా ఉన్న వీటిపై కూర్చోవడం, అటూ ఇటూ ఊగడం, బంతిపై ఎగరడం, ఒళ్లు విరుచుకుపోవడం వంటి కదలికలవల్ల నొప్పిని సులభంగా తట్టుకోగలుగుతారు. అంతేగాక ప్రసవం కూడా వేగంగా అవుతుంది.
పరిమితులు
వివిధరకాల స్థానాలు, కదలికలవల్ల తల్లికిగాని, లోపలి శిశువుకుగాని నష్టం కలుగుతుందని ఏ అధ్యయనంలో కూడా స్పష్టమవలేదు. అందువల్ల తమకు సౌకర్యంగా ఉండే ఏ రకమైన కదలిక, స్థానాన్ని అయినా ఎంచుకోవచ్చు. ఏదీ కాకుండా నిటారుగా కూర్చున్నా మంచిదే. ఎపిడ్యూరల్ వంటి కొన్నిరకాల పద్ధతుల్లో కాళ్లలో తగినంత సత్తువ ఉన్నప్పటికీ నడక అంత సురక్షితం కాదు. చాలా ప్రసూతి విభాగాల్లో సిబ్బంది తక్కువగా ఉండడం లేదా ఎపిడ్యూరల్ తో కూడా నడవగలిగేందుకు వీలయ్యే అనుకూలమైన చోటు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే జనన బంతులను అనుభవం ఉన్న పర్యవేక్షకుల సహాయంతో మాత్రమే ఉపయోగించాలి. లేకుంటే కింద పడిపోయే ప్రమాదం ఉంది. పైన తెలిపిన సమాచారం కింది ప్రచురణల నుంచి తీసుకున్నాం. మీకు మరింత సమాచారం కావలసివస్తే వీటిని చదవడంతోపాటు మీ ప్రసూతి వైద్యులతో చర్చించండి.
Murray Enkin, A Guide to Effective Care in Pregnancy and Childbirth, 3rd Ed., Oxford University Press, 2000
Eappen S, Robbins D., Nonpharmacological means pain relief for labor and delivery, Int Anesthesiol Clini. 2002 Fall; 40(4): 103-14, Review
Simkin P., Nonpharmacologic relief of pain during loabor: Systematic reviews of five methods, Am J Obstet gynecol, 2002 Volume 186, Number 5, S131-159.