శరీరంలో ఏ భాగాంలోనైనా కలిగే నొప్పిని గ్రహించకుండా ఉండడానికి చర్మంద్వారా ఇచ్చే అతి చిన్న విద్యుత్ షాక్ ను ట్రాన్స్క్యుటేనియస్ విద్యుత్ ప్రేరణఅ (టెన్స్) అంటారు. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స అవసరం అయినప్పుడు టెన్స్ ను ఉపయోగిస్తారు. నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు చేరకుండా ఈ విద్యుత్ ప్రవాహం ఓ ద్వారంలాగా అడ్డుకుంటుంది. శరీరంలో సహజసిద్ధమైన నొప్పి నివార కాలయిన ఎండార్ఫిన్లు ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడాన్ని ఈ విద్యుత్ ప్రవాహం ప్రేరేపిస్తుంది.
ప్రక్రియ:
వెన్ను కిందిభాగంలో లేదా పొత్తికడుపు ప్రాంతంలో విద్యుత్ ప్రవాహ నాళాలను అమరుస్తారు. ఇవి తల్లి నియంత్రణలో ఉండే ఓ చిన్న బాక్సుకు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ ప్రేరణలు ఎంత మోతాదులో ఇవ్వాలన్నది తల్లి అదుపులో ఉంటుంది. విద్యుత్ పెట్టె ద్వారా స్వల్ప పరిమాణంలో ఇచ్చే విద్యుత్తువల్ల నొప్పిలేని సంచలన స్థితి కలుగుతుంది. విద్యుత్ ప్రవాహ నాళాలను అమర్చిన చోట చర్మం మొద్దుబారిన భావన కలుగుతుంది.
పరిమితులు:
ప్రసూతి మహిళల్లో ట్రాన్స్క్యుటేనియస్ విద్యుత్ ప్రేరణల ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. టెన్స్ పద్ధతిని ఉపయోగించడంవల్ల నొప్పిని గ్రహించడంలో గాని లేదా నొప్పి తగ్గించే మందు వాడకం హెచ్చుతగ్గుల్లో గాని ఎటువంటి మార్పు కనిపించలేదు. అయినా చాలామంది మహిళల్లో టెన్స్ సహాయకారిగా ఉంటుందని తేలింది. బహుశా నొప్పిని ఎదుర్కోవడంలో టెన్స్ పాత్ర చైతన్యవంతంగా ఉండడమే ఇందుకు కారణం కావచ్చు. తల్లికిగాని బిడ్డకుగాని టెన్స్ వల్ల దుష్ప్రభావం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవు.
పైన తెలిపిన సమాచారం కింది ప్రచురణల నుంచి స్వీకరించడమైనది. టెన్స్ పై సమాచారం కావలసివస్తే వీటిని చదవడమేగాక మీ ప్రసూతి వైద్యులతో చర్చించండి.
Eappen S, Robbins D., Nonpharmacological means pain relief for labor and delivery, Int Anesthesiol Clini. 2002 Fall; 40(4): 103-14, Review
Simkin P., Nonpharmacologic relief of pain during loabor: Systematic reviews of five methods, Am J Obstet gynecol, 2002 Volume 186, Number 5, S131-159.
Murray Enkin, A Guide to effective Care in Pregnancy and Childbirth, 3rd Ed., Oxford University Press, 2000
టెన్స్ వనరులు
యు ఎస్ ఎ: http://www.paintechnology.com/060.htm
బ్రిటన్: http://pulsar-tens.com/main.html
(టెన్స్ కోసం మంచి గ్రాఫిక్స్ అందించినందుకు పల్సార్ కు ధన్యవాదాలు)
TENS Resources
USA: http://www.paintechnology.com/060.htm
Britain: http://www.pulsar-tens.com/main.html
(Thanks to Pulsar-tens for graphic)