ప్రతి ఐదు జననాల్లో ఒకటి సిజేరియన్ ద్వారా జరుగుతున్నది. సిజేరియన్ ను ముందే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం చేయవచ్చు లేక తల్లికో, శిశువుకో ప్రమాదం ఉన్నప్పుడు అత్యవసరంగా సిజేరియన్ చేయవలసి రావచ్చు. సిజేరియన్ ప్రసూతికి అనస్తీసియా తప్పనిసరి. శస్త్రచికిత్స ద్వారా చేసే ప్రసూతి చేయడానికి అనస్తీసియా తప్పనిసరి. శస్త్రచికిత్స చేసే ప్రాంతంలో మాత్రమే అనస్తీసియా ఇవ్వవచ్చు లేక శరీరం అంతటికీ అనస్తీసియా ఇవ్వవచ్చు. క్లినికల్ పరిస్థితులను బట్టి లేక పేషంటు ఆరోగ్యపరిస్థితిని బట్టి ఏరకమైన అనస్తీసియా ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. మీకు సురక్షితమైన, సౌకర్యవంతమైన విధనాన్ని మీ అనస్తీసియా డాక్టరు సూచిస్తారు. అనస్తీసియా శిశువుకు సురక్షితమైనదేనా? కేవలం వెన్నుపూస పైపొరభాగంలో ఇచ్చే అనస్తీసియా(రీజినల్ అనస్తీసియా), మొత్తం శరీరానికి ఇచ్చే అనస్తీసియా రెండూ సురక్షితమైనవే. శిశువుపై చెప్పుకోదగిన దుష్ప్రభావాలేవీ చూపవు. సాధారణంగా ప్రసూతి అనస్తీసియా డాక్టర్లు రీజినల్ అనస్తీసియానే ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. ఎందుకంటే రీజినల్ అనస్తీసియా శ్వాసప్రక్రియను నిరోధించే అవకాశాలు చాలా తక్కువ. అంతేగాక శస్త్రచికిత్స సమయంలో మెలకువతో ఉండడానికి వీలవుతుంది. నొప్పి కూడా ఉండదు. ఏరకమైన అనస్తీసియా ఇచ్చినా శిశువుకు హాని కలుగని రీతిలో తల్లికి సంబంధించిన అన్ని జైవిక ప్రమాణాలు తగిన పరిమితుల్లో ఉండే విధంగా పర్యవేక్షిస్తుంటారు. సిజేరియన్ ప్రసూతికి ముందు ఉపవాసం ఉండడం అవసరమా? ప్రణాళిక ప్రకారం జరిపే అన్ని శస్త్ర చికిత్సల్లోనూ, ఎటువంటి అనస్తీసియా ఇస్తున్నామన్న అంశంతో నిమిత్తం లేకుండా ముందుగా ఉపవాసం ఉండడం అన్నది తప్పనిసరి.(చూడండి: శిశుజనన సమయంలో నేను తినవచ్చునా, ఏదైనా ద్రవాహారం తీసుకోవచ్చునా?) అనస్తీసియా ఇచ్చే ముందు మీతో యాంటాసిడ్ సేవింపజేస్తారు. పొట్టలో ఉన్న ఆమ్లాలను తటస్థీకరించడం అవసరం. ఇలా చేయడం వల్ల వాంతులు జరిగి, శ్వాసప్రక్రియకు అవరోధం కలిగే అవకాశాలను తగ్గించవచ్చు. అంతేగాక నాడుల ద్వారా మీకు వికారం నుంచి విరుగుడు కలిగించే ఔషధాన్ని కూడా ఇస్తారు. నేను అప్పుడే ఆహారం తిని ఉంటే? శస్త్రచికిత్స చేయడానికి ఎనిమిది గంటల ముందు నుంచి ఉపవాసం తప్పనిసరి. ఒక వేళ ఆహారం తీసుకుని ఉంటే శస్త్రచికిత్స ఆలస్యమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయవలసి వస్తే, పొట్టలోని ఆహారం వాంతుల కారణంగా శ్వాసప్రక్రియకు అడ్డంపడకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
|
వెన్నుకు ఇచ్చే అనస్తీసియా
రీజినల్ అనస్తీసియా అంటే ఏమిటి?వెన్నుకు ఇచ్చే అనస్తీసియా లేక వెన్నుపూస పైపొరకు ఇచ్చే అనస్తీసియా లేక రెండుచోట్ల ఏకకాలంలో ఇచ్చే అనస్తీసియాలను రీజినల్ అనస్తీసియా అంటారు. వెన్ను వాహికలోకి అనస్తీసియా ఔషధాన్ని ఎక్కించడం ద్వారా శరీరంలోని ఏదో ఒక నిర్దుష్టభాగాన్ని మొద్దుబారేట్టు చేస్తారు. కాళ్లు, నడుము, రొమ్ములో కొంతభాగం మొద్దుబారిపోతాయి. వెన్ను అనస్తీసియాకు, ఎపిడ్యూరల్ అనస్తీసియాకు, సంయుక్త అనస్తీసియాకు తేడా ఏమిటి?వెన్నుపూస, నాడులు సెరిబ్రోస్పైనల్ ద్రవంతో కూడిన సంచీలో ఉమ్టాయి. ఈ సంచీ చుట్టూ ఉండే ఆవరణను వెన్నుపూస పైపొర(ఎపిడ్యూరల్ స్పేస్) అంటారు(రీజినల్ అనస్తీసియా భాగాన్ని చూడండి). ఈ సంచీలోని ద్రవంలోకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వెన్నుపూస అనస్తీసియాను ఇస్తారు. ఈ సంచీ పైభాగానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఎపిడ్యూరల్ అనస్తీసియా ఇస్తారు. ఎపిడ్యూరల్, వెన్నుపూస అనస్తీసియాల రెండింటీ ప్రభావమూ ఒకే విధంగా ఉంటుంది(శరీరంలోని చాలా భాగాన్ని మొద్దుబారేట్టు చేస్తుంది). వెన్నుపూసను ఆవరించి ముందుకుసాగే నాడులను ఈ రెండు రకాల అనస్తీసియాలు మొద్దుబారేట్టు చేస్తాయి. వెన్నుపూసకు ఇచ్చే ఇంజెక్షన్ నేరుగా తాకుతున్నందున అది వెంటనే ప్రభావం కలిగిస్తుంది. నొప్పులు రాకుండా సిజేరియన్ ద్వారా ప్రసూతి కావాలనుకునే వారు సాధారణంగా వెన్నుపూస అనస్తీసియాను కోరుకుంటారు. ఎపిడ్యూరల్ అనస్తీసియా ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఒక కేథటర్ ను ఎపిడ్యురల్ స్పేస్ లోకి చొప్పించి, మత్తు ఔషధాన్ని రకరకాల డోసుల్లో ఇస్తుంటారు. నొప్పులు పడే మహిళల్లో బాధను తగ్గించడానికి ప్రాథమిక చర్యగా ఎపిడ్యురల్ అనస్తీసియాను ఇస్తారు. వెన్నుపూసకు, ఎపిడ్యురల్ స్పేస్ కు రెండుచోట్లా అనస్తీసియా ఇవ్వవచ్చు. ఎపిడ్యురల్ స్పేస్ లోకి కేథటర్ ను చొప్పించిన తర్వాత వెంటనే వెన్నుపూసకు కూడా అనస్తీసియా ఇవ్వవచ్చు. వెన్నుపూస అనస్తీసియాతో వెంటనే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. తదుపరి ఎపిడ్యురల్ అనస్తీసియాతో ఆ ప్రభావాన్ని కొనసాగించవచ్చు. వెన్నుపూసకు అనస్తీసియా ఎలా ఇస్తారు?ఎపిడ్యురల్ అనస్తీసియా ఇవ్వడానికి అనుసరించిన విధానాన్నే వెన్నుపూస అనస్తీసియా ఇవ్వడంలోనూ అనుసరిస్తారు(చిత్రపటం చూడండి). తేడా ఏమంటే మత్తు ఔషధాన్ని నేరుగా వెన్నుపూసను అవరించి ఉన్న ద్రవీక్రుత సంచీలోపలికి ఇస్తారు. ఈ తరహా అనస్తీసియా తలనొప్పికి దారితీయకుండా చూడడానికి చాలా సన్నని సూదిని ఉపయోగిస్తారు. వెన్నుపూస అనస్తీసియా పనిచేస్తుందీ లేనిదీ ఎలా తెలుస్తుంది?వెన్నుపూస అనస్తీసియా ఇవ్వగానే పాదంలో జలదరించినట్టవుతుంది. వెచ్చగా ఉంటుంది. అక్కడ మొదలైన ప్రభావం కాళ్లకు, అటు నుంచి నడుముకు, రొమ్ముభాగానికి విస్తరిస్తుంది. మీ కాళ్లు మొద్దుబారినట్టుగా, భారంగా అనిపిస్తాయి. రొమ్ము భాగాన్నీ మొద్దుబారేట్టు చేసినప్పటికీ మీ శ్వాసప్రక్రియపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. అయితే శ్వాస తగ్గిపోయిన భావన మీలో కలుగుతుంది. మీరు తగినంతగా శ్వాసిస్తున్నప్పటికీ రొమ్ము మొద్దుబారిపోవడం వల్ల మీ మెదడుకు ఆ భావన కలుగదు. మీ చేతులు తేలికగా ఉండి, మీరు మాట్లాడగలిగితే మీరు తగినంతగా శ్వాస తీసుకున్నట్టే లెక్క. అంతేకాదు మీరు గాలి పీల్చుకుని వదలినప్పుడు మాస్కుపై తేమ కనిపిస్తూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. అన్నింటికీ మించి అనస్తీసియాలజిస్టు మీ శ్వాసను, ఆక్సీజన్ లెవెల్స్ను, రక్తపోటును, గుండె స్పందనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని గమనించండి. వెన్నుపూస అనస్తీసియా ఇచ్చిన తర్వాత అనస్తీసియా ప్రభావం శరీరంపై ఏమేరకు ఉందో అంచనా వేస్తారు. సాధారణంగా రొమ్ము దిగువ భావం నుంచి పాదాల వరకు శరీరం మొద్దుబారిపోతుంది. తగిన మోతాదులో ఇచ్చే అనస్తీసియా మిమ్మల్ని శస్త్రచికిత్సకు అవసరమైనవిధంగా సిద్ధం చేస్తుంది. నొప్పులకు ఇచ్చే ఎపిడ్యురల్ ను సిజేరియన్ కు ఇవ్వవచ్చునా?కొందరు మహిళలు నొప్పులు పడినప్పటికీ అంతిమంగా సిజేరియన్ అవసరమవుతుంది. నొప్పులు పెరిగి ప్రసూతికి మార్గం సుగమం కానప్పుడు, శిశువు ప్రాణానికి ముప్పు ఏర్పడినప్పుడు సిజేరియన్ అవసరం కావచ్చు. ఎపిడ్యురల్ సూది అప్పటికే ఇచ్చి ఉండి బాగా పనిచేస్తూ ఉంటే అనస్తీషియాలజిస్టు అధనంగా మత్తు ఔషధాన్ని ఇచ్చి శస్త్రచికిత్సకు అవసరమైన విధంగా శరీరం మొద్దుబారేట్టు చేస్తుంది. శస్త్రచికిత్సకు సరిపోయే విధంగా ఈ ఔషధాన్ని ఇస్తూ ఉంటారు. ఒక వేళ ఎపిడ్యురల్ పనిచేయకపోతే, దానిని తొలగించి వెన్నుపూస అనస్తీసియా లేక జనరల్ అనస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి, అత్యవసర పరిస్థితిని బట్టి ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. శస్త్రచికిత్స సమయంలో మెలకువతో ఉంటే నాకేమైనా అనిపిస్తుందా?వెన్నుపూస అనస్తీసియా లేక ఎపిడ్యురల్ అనస్తీసియా ఇచ్చిన తర్వాత శస్త్రచికిత్స జరుగుతున్నా మీకేమీ అనిపించదు. మెలకువతో ఉండడం వల్ల పొట్టభాగంలో శస్త్రచికిత్సకు సంబంధించిన కదలికలు మీకు తెలుస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ప్రసూతి వైద్యుడు పొట్టలోని కండరాలను, అవయవాలను వేరు చేస్తున్నప్పుడు ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు, ప్రసూతి సమయంలో ప్రసూతి వైద్య్ుడు పొట్టను కొందికి లాగి శిశువును బయటకి లాగి శిశువును బయటికి తీస్తారు. ఈ స్పందనలన్నీ రొమ్ములో ఒత్తిడిని కలిగిస్తాయి.
|