నడక ఎపిడ్యూరల్ లో స్పైనల్, ఎపిడ్యూరల్ రెండూ ఉంటాయి. వీటి గురించి కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ లో వివరంగా ఇచ్చాం. వెన్నుముక (స్పైనల్) అనస్తీషియా కాళ్లు బలహీనం కాకుండా వేగంగా నొప్పి తగ్గడానికి ఉపకరిస్తుంది.
సులభంగా అనల్జీసియా ఇవ్వడానికి వెన్నుపూస వెలుపలి పొర అనస్తీషియా (ఎపిడ్యూరల్) ఉపయోగపడుతుంది. ప్రసూతి సమయంలో ఎటువంటి నొప్పి లేకుండా నేలపై నడవగలగడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. అయితే నడవడం ద్వారా ప్రసూతి సమయాన్ని తగ్గించవచ్చా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే అనల్జీసియాకు కావలసిన అవసరాలను నడక తగ్గిస్తుంది. ప్రసూతి సమయంలో కొద్దిసేపు నడవగలిగే అవకాశం కలగడంవల్ల దీన్ని చాలామంది మహిళలు ప్రశంసిస్తారు. కొంత మంది అనస్తీషియాలజిస్టులు ప్రసూతి అనస్తీషియాకు సి ఎస్ ఇ పద్ధతిని ఉపయోగిస్తారు. కాని ఒకసారి ఎపిడ్యొొరల్ తీసుకోగానే నడవడం వీలుపడదు.
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి
Next to When Can I Have Pain Relief During Labor?