చాలా తక్కువ మంది గర్భిణుల్లో ప్రసూతి సమయంలో ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తుంది. సాధారణంగా మొదటి కాన్పు వారిలో, ప్రసూతి సమయం ఎక్కువగా ఉన్నవారిలో, ఎపిడ్యూరల్ అనస్తీషియా తీసుకున్నవాళ్లలో ఇటువంటి మార్పు కలిగే అవకాశం ఉంది. తల్లి లేదా శిశువు ఇన్ఫెక్షన్ కు గురైన సూచన ఇది అని పరిశోధనల్లో వెల్లడైంది. ఇలాంటప్పుడు శిశువులో ఇన్ఫెక్షన్ ను నిర్ధారించడానికి శిశువైద్యనిపుణులు రక్తపరీక్షలు చేస్తారు. ఎపిడ్యూరల్ తీసుకున్నా లేకున్నా చాలామంది మహిళల్లో ప్రసూతి సమయంలో జ్వరం రావడం జరుగదు. అయినా ఎపిడ్యూరల్ అనస్తీషియా తీసుకున్న వారిలో ఈ నిర్ధారణ అవసరం. ఇటీవలి డేటా ప్రకారం మొదటిసారి గర్భం దాల్చిన మహిళల్లో 24 శాతం మందికి ఇలా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కాగా ఎపిడ్యూరల్ తీసుకున్న వారిలో మాత్రం కేవలం అయిదు శాతం మందిలో మాత్రమే ఈ సమస్య కనిపిస్తుంది. రెండు లేదా ఆ తరువాత జరిగే ప్రసవాలు ఉన్నప్పుడు ఏ విధమైన తేడాను గుర్తించలేదు.
దీని వెనుక గల అసలు కారణం ఏమిటో ఇంతవరకు స్పష్టం కాలేదు. ప్రసూతి సమయంలో శరీరంలో ఉష్ణం జనించి శరీరమంతా వ్యాపిస్తుండవచ్చని ఒక ఊహ. ప్రసూతి సమయంలో నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్లు చాలా వేగంగా శ్వాస తీసుకుంటారు. నొప్పి నుంచి ఉపశమనం కలుగగానే శ్వాస సాధారణ స్థితికి రావడం వల్ల ఉష్ణం మెల్లమెల్లగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉందన్నది మరో భావన.
సంప్రదించిన గ్రంథాలు
ఎ సి ఒ జి (అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్) ప్రాక్టీస్ బుల్లెటిన్ ఆన్ అబ్స్టెట్రిక్ అనల్జీసియా అండ్ అనస్తీషియా. జూలై 2002:177-191.
ఫిలిప్ జె, అలెగ్జాండర్ జె ఎం, శర్మ కె, లివెనో కెజె, మెక్ ఇంటైర్ డిడి, విలే జె. ఎపిడ్యూరల్ అనల్జీసియా డ్యూరింగ్ లేబర్ అండ్ మెటర్నల్ ఫీవర్. అనస్తీషియాలజీ 1999, 90: 1271-5.