నొప్పుల సమయంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంకోసం ఈ సుగంధ చికిత్సను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం ఇటీవల అందరి దుఎష్టిని ఆకర్షిస్తున్నది. నొప్పుల సమయంలో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడంకోసం చాలా మంది అరోమాథెరపీని ఆశ్రయిస్తున్నారు. అరోమాథెరపీ వల్ల ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాధ తగ్గిన ఆనవాళ్లేమీ లేవు. కానీ నొప్పులు పడే మహిళల్లో ఈ థెరపీ ఒత్తిడి తగ్గించి, బాధను సహించే శక్తిని పెంచుతుంది. సుగంధ చికిత్స ప్రసూతికి సహకరించే వారిలోనూ, సన్నిహితుల్లోనూ ఒత్తిడి తగ్గించి మొత్తంగా ఆహ్లాదకర వాతావరణొ స్రుష్టించడానికి దోహదం చేస్తుంది.
టెక్నిక్: గులాబీ, గంధం, గన్నేరు, ఇతర పుష్పాల నూనెలను స్నానం సందర్భంగా ఉపయోగిస్తారు. తుడుచుకునే బట్టలపై చల్లుతారు. మర్ధన సందర్భంగా కూడా ఈ నూనెలను వాడతారు. గర్భిణీ స్త్రీల శరీరంపై చల్లడం కూడా మరో పద్దతి. నొప్పుల తీవ్రతను బట్టి ఒక్కో దశలో ఒక్కో రకం నూనెను వాడడం మంచిదని కొందరు సిఫారసు చేస్తారు. నొప్పులు తొలిదశలో ఉన్నప్పుడు ప్రశాంతతను ఇచ్చే నూనెలను ఉపయోగించాలని కొందరు సూచిస్తారు. నొప్పులు రెండవ దశకు చేరుకోగానే, అంటే బిడ్డ గర్భాశయం నుంచి బయటకి రావడం మొదలు కాగానే పెప్పర్ మింట్ వంటి నూనెలను ఇవ్వాలని, అది ధీమాను, నైతిక స్తైర్యాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు, వాటి ధర్మాలను దిగువ ఇస్తున్నాము:
చామోమైల్: చేమంతి పువ్వువంటి. ప్రశాంతతనిస్తుంది. రుతుక్రమానికి ముందు బాధను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. ముక్కు చీముడు (రైనిటిస్), మొటిమలు, ఎక్జీమా, ఇతర చర్మసంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యూకలిప్టస్: జామాయిల్, దగ్గు, జలుబు, రొమ్పు పడిశం(బ్రాంకైటిస్), వైరస్ నుంచి వచ్చే వ్యాధులు(వైరల్ ఇన్ఫెక్షన్స్), కండరాల నొప్పులు, కీళ సంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది.
జెర్మేనియం: ఒక రసాయనం. కషాయం వలె పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు, శిలీంద్రాల నుంచి వచ్చే వ్యాధులను(ఫంగల్ ఇన్ఫెక్షన్స్)ను మాన్చడానికి ఉపయోగపడుతుంది. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. చర్మసంబందమైన సమస్యలు, గజ్జి, తామర, గాయాలు మానడానికి దోహదం చేస్తుంది. స్వల్పంగా మూత్రకారకంగా పనిచేసే ఈ రసాయనం యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుంది.
లావెండర్: మరువం వంటి ఒక మొక్క. తలనొప్పులను, గాయాలను మాన్చడానికి ఉపయోగపడుతుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. కీటకాలు కాటువేసినప్పుడు విరుగుడుగా పనిచేస్తుంది. మొటిమలు, వాపులు తగ్గిస్తుంది. నిద్రలేమినుంచి కాపాడుతుంది. స్వల్పంగా డిప్రెషన్ కారకంగా పనిచేస్తుంది.
రోజ్: గులాబీ. గొంతువాపు, ముక్కుపుట్టేయడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్వల్పంగా నిద్రకారకంగా పనిచేస్తుంది. రుతుక్రమం ముందు, మెనోపాజ్ సమయంలోనూ కలిగే బాధ, ఒత్తిడి నుంచి ఊరటనిస్తుంది. కామాతురత తగ్గడం వంటి సమస్యలకు కూడా గులాబీ ఉపయోగపడుతుంది.
రోజ్ మేరీ: దవనం వంటి ఒక మొక్క, మానసిక, శారీరక అలసట నుంచి ఊరటనిస్తుంది. మతిమరుపు నుంచి కాపాడుతుంది. ఆస్త్మా, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, ఇతర బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శాండల్ వుడ్: మంచిగంధం. పొడిగా ఉన్న, పగిలిన శరీరానికి యాంటీ సెప్టిక్ గా ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతతను ఇస్తుంది. ఉత్తేజకారిగా పనిచేస్తుంది.
మార్జోరం: మరువం. తలనొప్పులను, గొంతువాపును, రుతుసంబంధమైన నొప్పిని తగ్గిస్తుంది. నిద్రాకారకంగా పనిచేసి, నిద్రలేమిని నివారిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మొటిమల నివారణకు దోహదం చేస్తుంది.
జాస్మైన్: జాజి పువ్వు. మనోవ్యాకులత(డిప్రెషన్)కు గురైనవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రసూతికి ముందు తలెత్తే వ్యాకులత నుంచి ఊరటనిస్తుంది. ప్రసూతి నొప్పుల సమయంలో ఉత్తేజకారిగా పనిచేసి, గర్భాశయం విస్తరించడానికి దోహదం చేస్తుంది.
నెరోలి: నారింజ చెట్ల నుంచి తీసే తైలం. నిద్రాకారకంగా పనిచేస్తుంది. వ్యాకులతకు, నిద్రలేమికి, నరాల బలహీనతకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను వేగిరపర్చుతుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మొటిమలు నివారిస్తుంది. రుతుక్రమం ముందు కలిగే బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరిన్ని వివరాలకోసం చూడండి:
www.aworldofaromatheraphy.com
పరిమితులు
- నేరుగా బాధను నివారించే లక్షణాలు కనిపించవు.
- కొన్ని రకాల తైలాలు కొందరికి మనో వికారాలు(అలర్జీ) కలిగించవచ్చు.
- నొప్పులు పడే చాలా మంది మహిళలకు కొన్ని రకాల తైలాలు పడకపోవచ్చు. కంపరం పుట్టించి, వాంతులు కావడానికి దారితీయవచ్చు.
నొప్పుల సమయంలో సుగంధ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మంచి అధ్యయనాలు ఏమీ లేవు. ఈ చికిత్సవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇది ఒక అనుబంద చికిత్సగా మాత్రమే ఉపయోగపడుతుంది. తమకు బాగా నచ్చే సుగంధ తైలాలను మాత్రమే ఎంపికచేసుకుని ఉపయోగించడం ప్రసూతి మహిళలకు మంచిది. దీంతో కంపరం, వాంతులు కలిగించే తైలాలను ముందుగానే నివారించవచ్చు.
పై సమాచారాన్ని దిగువ పేర్కొన్న ప్రచురణల నుంచి తీసుకోవడం జరిగింది. సుగంధ చికిత్స గురించి మరింత సమాచారం కావాలనుకునే వారు దిగువ సూచించిన పత్రాలు, వెబ్ సైట్లు చూడగోరుతున్నాము:
http://www.childbirthsolutions.com/articles/birth/aromabirth/index.php
http://www.securewebexchange.com/poyanaturals.com/catalog/default.php
ముర్రే ఎంకిన్, ఎ గైడ్ టు ఎఫెక్టివ్ కేర్ ఇన్ ప్రిగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, 3వ ఎడిషన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2000
(పోయనేచురుల్స్.కామ్ చిత్రాలు ఉపయోగించుకోవడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు)
(Thanks to poyanaturals.com for graphic)