ఎపిడ్యురల్ అనస్తీసియా వల్ల సమస్యలు తలెత్తకుండా చూడడానికి మత్తుమందు ఇచ్చే డాక్టరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మత్తు మందు వల్ల దుష్ప్రభావాలు కలగడం చాలా అరుదు అయినప్పటికీ, అవి ఎలా ఉంటాయో తెలుసుకోవడం అవసరం. కొన్ని దుష్ప్రభావాలు కొన్ని ప్రత్యేక సందర్భాలను బట్టి ఉంటాయి. అందువల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అనస్తీసియా డాక్టరుతో వివరంగా చర్చించలి.
వణుకు:
చాలా మందిలో వణుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా జరిగేదే. నొప్పుల సమయంలోనూ, ప్రసూతి సమయంలోనూ కొన్ని సార్లు ఇలా జరగవచ్చు. అనస్తీసియా తీసుకోకపోయినా వణుకు రావచ్చు. వెచ్చదనంలో ఉండేట్టు చర్యలు తీసుకుంటే ఇది తగ్గిపోతుంది.
రక్తపోటు తగ్గిపోవడం:
నాడీ వ్యవస్థ ద్వారా మీకు వివిధ రకాల ద్రవాలు అందిస్తూ మీ రక్తపోటును నిత్యం పర్యవేక్షిస్తూ, అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు. రక్తపోటు పడిపోవడాన్ని చాలా త్వరితగతిన అదుపు చేస్తారు.
నొప్పుల సమయంలో దురద రావడం:
ఎపిడ్యురల్ అనస్తీసియాలో మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల ఇలా దురద పెట్టవచ్చు. దురద భరించలేనిస్థాయికి పెరిగితే, అనస్తీసియాలజిస్టు ప్రత్యామ్నాయ ఔషధాలతో వెంటనే చికిత్స చేస్తారు. అయితే చాలా మందిలో దురద చాలా స్వల్పంగా మాత్రమే వస్తుంది.
అనస్తీసియా పడకపోవడం:
ఇలా చాలా తక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సార్లు తీవ్రమైన సమస్యగా పరిణమించవచ్చు. అనస్తీసియా వల్ల గతంలో మీకు ఎప్పుడయినా సమస్యలు వచ్చాయా లేదా అన్న విషయాన్ని అనస్తీసియా డాక్టరుకు వివరించాలి.
శ్వాసపీల్చుకోవడం కష్టం కావడం:
చాలా కొద్ది సందర్భాలలో అనస్తీసియా వల్ల రొమ్ము కండరాలు బిగుసుకుపోవచ్చు. గాలిపీల్చుకోవడం కష్టం కావచ్చు. అదనంగా ఆక్సీజను అందించడం ద్వారా ఈ సమస్య నుంచి ఊరటనివ్వాలి.
అనస్తీసియా సూది మందు పొరపాటున నాడుల్లోకి ఇవ్వడం:
వెన్నుపూస పైపొరకు అనస్తీసియా ఇచ్చేప్పుడు ఒక్కోసారి సూది మందు నాడుళ్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రసూతి సమయంలో నాడులు ఉబ్బెక్కుతాయి. అందువల్ల వెన్నుపూస పైపొరకు ఇవ్వాల్సిన సూదిమందు నాడులకూ తగిలే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని నివారించేందుకు డాక్టరు పరీక్ష నిమిత్తం ముందుగా మీకు కొద్దిపాటి డోసు అనస్తీసియా ఇచ్చి, మీకు మత్తుగా ఉందీ లేనిదీ కనుక్కుంటాడు. చెవులు మొద్దుబారిపోవడం, గుండెకొట్టుకోవడంలో మార్పురావడం వంటి లక్షణాలేవీ లేకపోతే మత్తు సరైన చోట ఇచ్చినట్టుగా నిర్థారించుకుని, తుది డోసు ఇస్తారు.
కొన్ని చోట్ల విపరీతంగా బాధ కలగడం, బాధా నివారణ చర్యలేవీ పనిచేయకపోవడం:
కొన్ని సందర్భాల్లో బాధ కలిగించే అన్ని భాగాల్లోకి మత్తుమందు విస్తరించకపోవచ్చు. అప్పుడు అనస్తీసియాలజిస్టు పడకమీద గర్భిణి పొజిషన్ మార్చవచ్చు. ఎపిడ్యురల్ కేథటర్ ను ఉపసంహరించి బాధ నుంచి ఉపశమనం కలిగించవచ్చు. తగిన విధంగా బాధా నివారణ కలగకపోతే, తరచూ ఎపిడ్యురల్ కేథటర్ ను తొలగిస్తూ, తిరిగి అమరుస్తూ ఉండాలి. అనస్తీసియాలజీ డాక్టరు మీకు ఊరట కలిగించే విధంగా ఈ మార్పులు చేస్తూ ఉంటారు.
నాడుల్లో పోటు లేక షాక్(పారెస్థీసియాస్):
వెన్నుపూస పైపొరలోకి అనస్తీసియా సూది (కేథెటర్)ని చొప్పించేప్పుడు అది నాడులకు రాసుకుపోయి నాడుల్లొతీవ్రప్రతిస్పందనలను కలిగించవచ్చు.ఇలా జరగడం సాధారణమే.అయితే ఈ కారణంగా నాడులు శాశ్వతంగా దెబ్బతినే అవకాశాలు చాలా అరుదు.
వెన్నునొప్పి:
అనస్తీసియా సూది ఇవ్వడం వల్ల వెన్నుభాగంలో నోప్పి ఉండే అవకాశం ఉంది.ఈ రోజంతా ఉండవచ్చు.ఇది కాకుండా సాధారణంగా కూడా వెన్నునొప్పి రావచ్చు.ఆనొప్పి ఎపిడ్యురల్ వల్లనే వచిందని చెప్పలేము.సహజ ప్రసూతి జరిగిన మహిళల్లో కూడా వెన్నునొప్పి వచ్చి, కొద్దిరోజుల పాటు ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాల్లో వెల్లడవుతున్నది. ఎపిడ్యురల్ లో కూడా అటువంటి వెన్నునొప్పి రావచ్చు. అసలు ప్రసూతి మహిళల్లోనే వెన్నునొప్పి అవకాశాలు ఎక్కువ. గర్భం వల్ల వెన్నులోని అస్థిబంధకాలు సాగే అవకాశం ఉంటుంది. అవి తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు వెన్నునొప్పి ఉండే అవకాశం ఉంది.
తలనొప్పి:
ప్రసూతి తర్వత తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు ఎపిడ్యురల్ అనస్తీసియానే కారణం కానక్కరలేదు. అయితే ఎపిడ్యురల్ అనస్తీసియా సూది వెన్నుముకను కప్పి ఉండే ద్రవీక్రుత పొరను గుచ్చుకున్నప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. వెన్నుముకను ఆవరించి ఉండే ద్రవం లీకయి వెన్నుముక పైపొరలోకి జారినప్పుడు తలనొప్పి వస్తుంది. ఎపిడ్యురల్ సూది ఇచ్చిన తర్వాత 24 గంటల్లోపల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కూర్చున్న సమయంలో తలనొప్పి వస్తుంది. పడుకుంటే తగ్గిపోతుంది. తల, మెడలో కొద్దిరోజులపాటు నొప్పి, ఇబ్బంది కలగవచ్చు. పడుకోవడం, ద్రవాహారం తీసుకోవడం, నొప్పి మందులు తీసుకోవడం ద్వారా ఈ రకమైన తలనొప్పిని నివారించవచ్చు. అయినా తలనొప్పి తగ్గకపోతే, కడుపులో వికారం ఉన్నా, వెలుతురు చూడడానికి ఇబ్బంది అనిపించినా అదనపు చికిత్స తీసుకోవలసి ఉంటుంది.
నాడులు దెబ్బతినడం, వెన్నుపూస పైపొరభాగంలో రక్తం స్రావం కావడం, పక్షవాతం రావడం, ఇన్ ఫెక్షన్ రావడం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు చాలా అరుదు.
ఎపిడ్యురల్ సూదిని వెన్నుభాగంలో ఇస్తున్నందున, ప్రసూతి తర్వాత తలెత్తే సమస్యలను సహజంగానే ఎపిడ్యురల్ అనస్తీసియాకు ముడిపెడతారు. అయితే నాడీ సంబంధమైన సమస్యలు ఎక్కువగా గర్భాశయంలో శిశువు కలిగించే ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయి. కాళ్లలో ఏదైనా బలహీనత అనిపిస్తే, మీ అనస్తీసియా డాక్టరు సరైన విశ్లేషణ చేసి, మీకు తగిన చికిత్స చేస్తారు.