Skip to content

Methods to decrease childbirth Pain -Telugu version

Welcome to pain relief during childbirth – Telugu Version

  • బాధారహిత ప్రసవం అనే వెబ్ సైట్
  • నేపథ్యం
  • ప్రసవ సమయంలో నొప్పి
  • ప్రసవ సమయంలో నొప్పి తీవ్రత
  • నొప్పి ఉపశమన పద్ధతులు
    • సిస్టమిక్ మెడికేషన్స్(దైహిక మందులు)(దైహిక ఔషధ ప్రయోగం)
    • రీజనల్ అనెస్తీషియా
    • ఎపిడ్యూరల్ అనస్తీసియా ఉత్తమమా లేక ఐవి అనస్తీసియానా?
  • ప్రత్యామ్నాయ బాధా నివారణ చికిత్స
    • సుగంధ చికిత్స (ఆరోమాపతి)
    • సమ్మోహన చికిత్స (హిప్నోథెరపి)
    • శ్వాస చికిత్స (లామేజ్)
    • జల చికిత్స (బాతింగ్)
    • సూదిపొడుపు వైద్యం (ఆక్యుపంచర్)
    • నాడీ స్పందన చికిత్స (ట్రాన్స్కుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్(టెన్స్))
    • స్పర్ష, మర్ధన (టచ్, మర్ధన)
    • నొప్పుల సమయంలో తల్లిని వివిధ భంగిమల్లో కశిలించడం (మాటర్నల్ మూవ్మెంట్ అండ్ పొజిషనల్ చేంజెస్ డ్యూరింగ్ లేబర్)
  • రీజనల్ అనెస్తీషియా
    • రీజినల్ అనస్తీషియా రకాలు
    • రీజినల్ అనస్తీసియా ఎలా పనిచేస్తుంది?
      • వెన్నుముక
      • రీజినల్ అనస్తీసియా ఇచ్చే ప్రాంతం నిర్మాణం
    • ఎపిడ్యూరల్ ఇచ్చేముందు నేను ఎలాంటి పొజిషన్ లో ఉండాలి?
    • ప్రసవానికి ఎపిడ్యూరల్ ప్రక్రియ
  • ఎపిడ్యూరల్ అనల్జీసియా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
    • ప్రసవనొప్పి ఉపశమన పర్యవేక్షణ
    • ఎపిడ్యూరల్ అనల్జీసియా సమయంలో రక్తపీడనంలో మార్పులు
    • ఆదర్శవంతమైన ఎపిడ్యురల్ అనల్జీసియా అంటే ఏమిటి?
    • ఎపిడ్యూరల్ సమయంలో ప్రసవం నొప్పి ఉపశమన పర్యవేక్షణ
  • మీరు ఏమి తెలుసుకోదలచుకున్నారు?
    • కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా (సి ఎస్ ఇ)
    • రోగి నియంత్రిత ఎపిడ్యూరల్ అనల్జీషియా
    • నడక ఎపిడ్యూరల్
    • వెన్నుపూస పైపొర భాగం(ఎపిడ్యూరల్)లో మత్తు ఎటువంటి సందర్భాలలో తీసుకోవచ్చు?
    • శిశువుపై తక్కువ ప్రభావం కలిగించే విధానం ఏదీ?
    • ప్రసూతి పురోగమనంపై నొప్పి ఉపశమన ప్రభావం
      • ప్రసూతి పురోగమనంపై నొప్పి ఉపశమన ప్రభావం
    • ప్రసూతికి ముందు నేను తినడం, తాగడం చేయవచ్చా?
    • ఎపిడ్యూరల్ చనుబాలపై ప్రభావం చూపుతుందా?
    • ఎపిడ్యూరల్ అనస్తీషియా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుందా?
    • పచ్చబొట్టు పొడిపించుకుని ఉంటే ఎపిడ్యూరల్ తీసుకోవచ్చా?
  • చింతించకండి..
    • సూదులంటే భయపడుతున్నారా?
    • ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏమవుతుందోనని ఇంకా సందేహమా?
  • ఎపిడ్యురల్ అనస్తీసియా దుష్ప్రభావాలు, సమస్యలు
  • తరచుగా అడిగే ప్రశ్నలు
  • శస్త్రచికిత్స ద్వారా ప్రసూతి
    • వెన్నుకు ఇచ్చే అనస్తీసియా
    • సిజేరియన్ ప్రసవం కోసం జనరల్ అనస్తీషియా
    • సిజేరియన్ ప్రసవం తరువాత వచ్చే నొప్పి నుంచి ఉపశమనం
  • రచయత గురించి
  • ధన్యవాదాలు
  • Toggle search form

వెన్నుపూస పైపొర భాగం(ఎపిడ్యూరల్)లో మత్తు ఎటువంటి సందర్భాలలో తీసుకోవచ్చు?

వెన్నుపూస పైపొర భాగంలో మత్తు ఎటువంటి సందర్భాలలో ఇవ్వాలన్న నిర్ణయం మీతోపాటు సర్జరీ చేసే డాక్టరు, మత్తు ఇచ్చే డాక్టర్లపై ఆధారపడి ఉంటుంది. బాగా నొప్పులు వస్తూ ఉండి, గర్భాశయం మార్గం ఎక్కువగా సంకోచవ్యాకోచాలకు గురవుతూ ఉంటే సాధారణంగా వెన్నుపూస పైపొరకు మత్తు ఇస్తారు. వెన్నుపూస భాగంలో మత్తు తీసుకోవాలన్న ఆసక్తి మీలో ఏమాత్రం ఉన్నా, మిమ్మల్ని ముందుగా అనస్తీసియా డాక్టరును చూడాల్సిందిగా కోరతాము. ఆయన మీ వైద్య చికిత్సా చరిత్రను పరిశీలించి, పరీక్షలు నిర్వహించడానికి ఇది దోహదం చేస్తుంది. నొప్పులు ఇంకా తీవ్రం కాకముందే, భాధ తెలియకుండా ప్రసూతి కావడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. రకరకాల అవకాశాల్లో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలియజేస్తూ మత్తు డాక్టరుకు ఒక ఆమోదపత్రం సంతకం చేసి ఇవ్వాలి. అయితే అంతమాత్రం చేతనే వెన్నుపూస పైపొరకు మత్తు తీసుకోవాల్సిన్ అగత్యం ఏదీ మీపై ఉండదు. ఆ తర్వాత కూడా సహజ ప్రసూతి మార్గాన్ని ఎంచుకోవచ్చు లేక మరేదైనా బాధా నివారణ మార్గాన్ని ఎంచుకోవచ్చు.

మీకు వెన్నుపూస పైపొరకు మత్తు ఇవ్వాలా లేదా అన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. జననాంగంలో పాప ఏ స్థితిలో ఉంది? తొలి కాన్పా?నన్న అంశాలు కూడా కీలకపాత్ర వహిస్తాయి. వెన్నుపూసకు మత్తు ఇవ్వడానికి ముందు నొప్పుల వల్ల గర్భాశయ ద్వారం వెడల్పు మరో నాలుగు సెంటీమీటర్లు పెరగాలని కొందరు డాక్టర్లు నియమంగా భావిస్తారు. ముందుగా వెన్నుపూసకు మత్తు ఇస్తే, నొప్పులు ఆలస్యం అవుతాయని వారు భావించి ఉండవచ్చు. అయితే ఈ అంశంపై లభిస్తున్న సమాచారం వివాదాస్పదమైనది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చాలా ముందుగానే వెన్నుపూస పైపొరకు మత్తుమందు ఇవ్వాల్సి రావచ్చు. ప్రసూతి వైద్య నిపుణుడు తన అనుమతి ఇవ్వగానే మత్తు డాక్టరు వెన్నుపూస పైపొరకు మత్తుమందు ఇస్తారు. మత్తుడాక్టరును ముందుగా చూసి ఉండకపోయి ఉంటే, ఆయన అప్పటికప్పుడు మీ వైద్య చికిత్సా చరిత్రను పరిశీలించి, పరీక్షలు నిర్వహిస్తారు. మత్తు తీసుకోవడానికి మీనుంచి ఆమోదపత్రం తీసుకుంటారు.

శిశువు తల బయటకి కనిపించేలోపు ఎప్పుడైనా వెన్నుపూస పైపొరకు మత్తు ఇవ్వవచ్చు. తొలుత సహజ ప్రసూతికోసం ప్రయత్నించి, నొప్పులు మరీ తీవ్రం అయినప్పుడయినా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అంతకుముందు మత్తు డాక్టరును సంప్రదించకపోయినా సరే. ప్రసూతి విద్యా తరగతులకు మీరు హాజరయి, వివిధ రకాల బాధా నివారణ ప్రత్యామ్నాయాలను గురించి తెలుసుకోవడం మంచిదని మేము సిఫారసు చేస్తాము. అన్నింటినీ మించి మీరు ప్రసూతికి ముందుకాలంలోనూ, నొప్పుల సమయంలోనూ అపోహలకు అతీతంగా, విశాల ద్రుష్టి, వెసులుబాటుతత్వం కలిగి ఉండాలి. మనుషులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్రసూతి నొప్పులు వస్తుంటాయి. మీరు ఎంత విశాల మనస్కులయితే మీకు, మీ బిడ్డకు అంతగా ప్రయోజనం ఉంటుంది.

అమెరికా ప్రసూతి వైద్యులు, స్త్రీ వైద్యనిపుణుల కళాశాల తాజా అభిప్రాయం, ఫిబ్రవరి 2002:

గర్భాశయ ద్వారం విస్తరించడానికి ముందు వెన్నుపూసకు మత్తు మందు తీసుకున్న తొలిచూరు మహిళల్లో సిజేరియన్ చేయవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఒక వాదన ఉంది.దీనికి సంబందించి లభిస్తున్న రకరకాల సమాచారం పరస్పరం విరుద్దంగా, వివాదాస్పదంగా ఉంది. అయినా దీని పర్యవసానంగా కొన్ని సంస్థలు వెన్నుపూసకు మత్తు మందు ఇవ్వడానికి ముందు నొప్పులు పడుతున్న మహిళ గర్భాశయద్వారం నాలుగైదు సెంటీమీటర్లు విస్తరించాలని నియమంగా పెట్టుకున్నాయి. ఈ సంస్థలు పేషంట్ల అవసరాలకు అనుగుణంగా సొంత చికిత్సా విధానాలను అభివ్రుద్ది పర్చుకున్నయేమో స్పష్టంగా తెలియదు. నొప్పులు ఎక్కువయ్యే కొద్దీ గర్భిణులు తీవ్రమైన బాధను అనుభవించవలసి వస్తుంది. వారు అంతతీవ్రంగా బాధపడుతున్నప్పుడు, ఆ బాధను నివారించడానికి సురక్షితమైన చికిత్సా విధానాలు ఉన్నప్పుడు జోక్యం చేసుకోకుండా ఉండడం వైద్యసూత్రాల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. అందువల్ల, వైద్యపరంగా ప్రతికూల సూచనలు ఉంటే తప్ప, నొప్పుల సమయంలో గర్భిణి కోరితే వెంటనే బాధా నివారణ చర్యలు చేపట్టాలని అమెరికా ప్రసూతి వైద్యులు, స్త్రీ వైద్యనిపుణుల కళాశాల, అమెరికా అనస్తీసియాలజిస్టుల సంస్థలు సంయుక్తంగా అభిప్రాయపడ్డాయి. ఎటువంటి బాధానివారణ చర్యలు చేపట్టాలన్న విషయంలో ప్రసూతి వైద్యులు, మత్తు డాక్టర్లు, పేషంటు, ఇతర సహాయక సిబ్బంది సమన్వయంతో నిర్ణయం చేయాలి.

సంప్రదించిన గ్రంధాలు: ప్రాక్టీస్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆబ్స్టెరిక్ అనస్తీసియా, అనస్తీసియాలజీ 1999;90:600


తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి

  

Copyright © 2025 Methods to decrease childbirth Pain -Telugu version.

Powered by PressBook Premium theme