ఎపిడ్యూరల్ చనుబాలపై ప్రభావం చూపుతుందా?

భవానీ శంకర్ కొడాలీ, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్

విలియం కామ్ మాన్, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్

 

నొప్పులు తగ్గించడంకోసం, ప్రసూతి తేలికగా కావడంకోసం ఇచ్చే ఎపిడ్యూరల్ అనస్తీసియాలో ఔషధాలను ప్రస్తుతం చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. లోతుగా విశ్లేషిస్తే శిశువులో ఈ ఔషధాల ప్రభావం కనిపెట్టవచ్చు. అయితే వాటి ప్రభావం చాలా స్వల్పం. నొప్పుల సమయంలోనో, సిజేరియన్ సమయంలోనో ఎపిడ్యూరల్ అనస్తీసియా ప్రభావం ఎక్కువకాలం కొనసాగినప్పటికీ శిశువుపై అవి కలిగించే ప్రభావం పరిమితమే. కొందరు గర్భిణుల్లో చనుబాల సమస్య తలెత్తవచ్చు. ఎటువంటి అనస్తీసియా ఇచ్చామన్న విధానంతో నిమిత్తం లేకుండా ఇటువంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. మీ ఆస్పత్రిలో అందుబాటులో ఉండే చనుబాల నిపుణుడైన డాక్టరును సంప్రదించి ఈ సమస్యను అధిగమించవచ్చు. చనుబాలు శిశువుకు గరిష్టస్థాయిలో పోషకాలను అందిస్తాయి. ఔషధాల దుష్ప్రభావం ఉండదు.

ఎసిఒజి(అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెరీసియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్)ప్రాక్టీస్ బులెటిన్ ఆన్ అబ్స్టెరిక్ అనల్జీసియా అండ్ అనస్తీసియా, జూలై 2002;36:177-191

బేడర్ ఎ ఎం, ప్రాగ్నెటో ఆర్, తెరూయి కె, ఆర్థర్ జి ఆర్, లోఫెర్స్కీ బి, దత్తా ఎస్: మాటర్నల్ అండ్ నియోనాటల్ ఫెంటనీ అండ్ బ్యూపీవకెయిన్ కాన్సెంట్రేషన్స్ ఆఫ్టర్ ఎపిడ్యూరల్ ఇన్ఫ్యూజన్ డ్యూరింగ్ లేబర్. అనస్తీ అనల్ 1995;81:829-31

హాఫెర్న్ ఎస్ హెచ్, లెవైన్ టి, విల్సన్ డిబి, మెక్డోనెల్ జె, కాట్సిరిస్ ఎస్ ఇ, లీటన్ బి ఎల్: ఎఫెక్ట్ ఆఫ్ లేబర్ అనల్జీసియా ఆన్ బ్రీస్ట్ ఫీడింగ్ సక్సెస్. బర్త్ 1999;26:83-88

Click below for the next item