ఐ.వి. విధానంలో ఇచ్చే ఔషధాలన్నీ మావి(ప్లాసెంటా)ని దాటుకుని శిశువును చేరతాయి. దీంతో అవి శిశువుపై కూడా కొంత ప్రభావం చూపుతాయి. శిశువు గుండె కొట్టుకునే రేటులో కూడా స్వల్పంగా మార్పులు రావచ్చు. అయినా ఈ కారణంగా గుండె పనిచేసే విధానానికి పెద్దగా హాని జరగదు.
ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఏమంటే, ఐవి ఔషధాలు శిశువును వ్యాకులపరిచే అవకాశాలు ఉండడం. ఏ ఔషధం ఇస్తున్నాం, ఎంత డోసు ఇస్తున్నాం, ఏ సమయంలో ఇస్తున్నాం అన్న అంశాలపై శిశువుపై ప్రభావం చూపడం ఆధారపడి ఉంటుంది. ఔషధాల ప్రభావం వ్యాప్తి చెందకముందే శిశువు జనిస్తే, ఔషధాల ప్రభావం పరిమితంగా ఉంటుంది. శిశువు సాధారణంగా ఉండవచ్చు. లేదంటే స్వల్పంగా నిద్రలో ఉండవచ్చు. కొన్ని వారాలపాటు పిల్లవాడి ప్రవర్తనలో తాత్కాలిక మార్పులు ఉండవచ్చు. అలాగాక పిల్లవాడిపై ఔషధాల ప్రభావం ఎక్కువగా ఉంటే శ్వాస దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు శిశువైద్య నిపుణుడిని సంప్రదించవలసి రావచ్చు. సకాలంలో ఇవ్వడం, తగిన డోసు ఇవ్వడం ద్వారా శిశువుపై ఐ.వి. ఔషధాల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
సంప్రదించవలసిన గ్రంధాలు:
1. కోహెన్ ఎస్ ఇ, టాన్ ఎస్, ఆల్ బ్రైట్ జిఎ, ఎపిడ్యూరల్ ఫెటానీ/బ్యూపీవకెయిన్ మిక్సర్స్ ఫర్ ఆబ్స్టెరిక్ అనల్జీసియా, అనస్తీసియాలజీ, 1987;67:403
2. విస్కోమి సిఎం, హుడ్ డిడి, మెలోని పిజె,;ఫెటల్ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఆఫ్టర్ ఎపిడ్యూరల్ ఫెటాని డ్యూరింగ్ లేబర్. అనస్తీసియా అండ్ అనల్జీసియా 1987; 71:679
3. జోపిలా పి, జోపిలా ఆర్, హాల్ మాన్ ఎ, కోవులా ఎ; లుంబార్ ఎపిడ్యూరల్ అనల్జీసియా టు ఇంప్రూవ్ ఇంటర్విల్లస్ బ్లడ్ ఫ్లో డ్యూరింగ్ లేబర్ ఇన్ సివియర్ ప్రిక్లాంప్సియా. ఆబ్స్టెరిక్స్ అండ్ గైనకాలజీ 1982; 59:158
4. హోడ్కిన్సన్ ఆర్, భట్ ఎం, వాంగ్ సిఎన్; డబుల్ బ్లైండ్ కంపారిజన్ ఆఫ్ న్యూరో బిహేవియర్ ఆఫ్ నియోనేట్ ఫాలోయింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిఫరెంట్ డోసెస్ ఆఫ్ మెపిరిడైన్ టు ది మదర్. కెన్. అనస్త్. సొ.జోర్నల్ 1978; 25:405
|