రీజినల్ అనస్తీసియా ఇచ్చే ప్రాంతం నిర్మాణం

భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

వెన్నుముక

ఒకదానిపై ఒకటి పొందికగా అల్లుకున్న వరుస ఎముకల సముదాయం వెన్నుముక. పక్కటెముకలు కూడా వెన్నుముక నుంచి పరుచుకున్నవే. వెన్నుపూస, నాడులు జంటగా వెన్నుముకను అంటిపెట్టుకుని ఉంటాయి. దిగువ ఇచ్చిన చిత్రంలో వెన్నుముక పైపొరను లేక వెన్నుపూసను నిశితంగా చూడండి.

వెన్నుపూస, నాడులు

వెన్నును రక్షించే ఒక ప్రత్యేకమైన ద్రవంతో కూడిన సంచీ వంటి ఆక్రుతిలో వెన్నుపూస ఉంటుంది. ఈ సంచీ పైభాగాన్నే వెన్నుముక పైపొరగా, అనస్తీసియా ఇవ్వదగిన భాగంగా గుర్తించండి. ఇక్కడే నాడులు బయటకి వచ్చి, అడ్డంగా వెన్నెముకపైన పరుచుకుంటాయి. దానినే ఎపిడ్యురల్ అనస్తీసియా ఇవ్వదగిన ప్రాంతంగా పరిగణిస్తారు. వెన్నెముక పైపొరకు సూది చేరడానికి అవసరమైన ఖాళీ ఇక్కడ పక్కటెముకల్లో ఉంటుంది.

Click below

Next