బాధారహిత ప్రసవం అనే వెబ్ సైట్ ను ఇంగ్లీషులో వ్రాసిన నేను, మాత్రుభాషైన తెలుగులోకి అనువదించాలని నా చిరకాల కోరిక. నా ఈ కోరిక తీరటానికి ఇనగంటి వెంకట్రావుగారి ప్రోత్సాహం, పట్టుదల కారణం. కట్టా శేఖరరెడ్డిగారు కూడ ఎంతో సహకరించారు.
ఇనగంటి వెంకట్రావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమిక్ చైర్మన్ గా ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే జర్నలిస్ట్ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా చేసిన పద్మశ్రీ ఎన్.టి.రామారావుగారి జీవిత చరిత్ర 'ఒకే ఒక్కడు' అనే పుస్తకం వ్రాసినారు.
ప్రొఫెషనల్ వెబ్ సైట్ ను అనువదించటము అంత తేలిక కాదు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజికి ప్రిన్సిపల్ గా ఉన్న కట్టా శేఖరరెడ్డిగారు మరియు అతని సిబ్బంది సహకారం అందించటం వలననే నొప్పిలేకుండా ప్రసవం అనే విషయం గురించి తెలుగులో సమాచారం అందించుటకు సాధ్యమైనది. ఏమి ఆశించకుండ, తెలుగు వారికి వారందించిన సహకారం, జర్నలిజం మీద వారికున్న ఆపేక్షను తెలుపుతుంది.
నొప్పిలేని ప్రసవం ఎలా సాధ్యం అనే అవగాహన అన్ని వైద్యశాలలోను ఇప్పుడు లభించుటలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ వలన అది తొందరలోనే సాధ్యం కావచ్చు. ఆడవారందరికి వెబ్ చూసే సౌకర్యం ఇంకను లేకపోవచ్చు. అయితే ఈ వెబ్ సైట్ ప్రసూతి వైద్య నిపుణులకు ఉపయోగపడుతుందని, దానిని వారు గర్భస్త్రీకి విశదీకరించగలరని ఆశిస్తున్నాను.
నొప్పిలేకుండా హాయిగా ప్రసవించాలని కోరుకునే మహిళలకు కావలసిన సమచారం అందించే వెబ్ సైట్ ఇది. నొప్పి నివారక పద్దతులను ఎంచుకోవడం మీ ఇష్టం. నొప్పిలేని ప్రసవం విషయంలో చెలరేగిన వివాధంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోవడంలేదు. శిశుజనన ప్రక్రియ గురించి మేమందించిన సమాచారం ఆధారంగ మీ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. మీ ప్రసూతి వైద్య నిపుణులు, మిడ్ వైఫ్ లు, ఫిజిషియన్లతో చర్చించడం ఉత్తమం. ఐతే కొన్నేళ్లుగా సాగిన పరిశోధనలు, వేలమంది మహిళలపై చేసిన అధ్యయనాల ఆధారంగా ఈ వెబ్ సైటును రూపొందించడమైనదని గ్రహించగలరు. ప్రసవం కోసం వచ్చేముందు గర్భిణుల్లో కలిగే అనేక సందేహాలను బట్టి ఇది తయారుచేయడమైనది. తరచుగా చాలామంది గర్భిణులు నొప్పి నివారక పద్ధతుల గురించి మాకు ఫోన్లు చేస్తుంటారు. అవగాహన ఉన్న రోగి ప్రసూతి సమయంలో పూర్తి సహకారం అందించగలుగుతారు. అందువల్ల ప్రసూతికి ముందుగానే నొప్పి నివారక పద్దతులపై అవగాహన కల్పించడంద్వారా అటు రోగికి, ఇటు వైద్యులకూ లాభం ఉంటుందని మా నమ్మకం. సరైన మత్తుమందు పద్దతి ఎంచుకోవాలంటే ఈ వెబ్ సైటు చదవడం లేదా అనస్తీషియాలజిస్టుతో చర్చించడం రెండే అనువయిన మార్గాలు. సరైన నిర్ణయం తీసుకోగలగడానికి మీకు పూర్తి సమాచారం అందించాలన్నదే మా ఆకాంక్ష. ఈ వెబ్ సైటులోని అంశాలను బ్రౌజ్ చేసేముందు విషయసూచికలో ఉన్న డిస్ క్లెయిమర్ గమనికను చదవవలసిందిగా మా విఙ్ఞప్తి.