> |
|
బాధారహిత ప్రసవం అనే వెబ్ సైట్ ను ఇంగ్లీషులో వ్రాసిన నేను, మాత్రుభాషైన తెలుగులోకి అనువదించాలని నా చిరకాల కోరిక. నా ఈ కోరిక తీరటానికి ఇనగంటి వెంకట్రావుగారి ప్రోత్సాహం, పట్టుదల కారణం. కట్టా శేఖరరెడ్డిగారు కూడ ఎంతో సహకరించారు. ఇనగంటి వెంకట్రావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమిక్ చైర్మన్ గా ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే జర్నలిస్ట్ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా చేసిన పద్మశ్రీ ఎన్.టి.రామారావుగారి జీవిత చరిత్ర 'ఒకే ఒక్కడు' అనే పుస్తకం వ్రాసినారు. ప్రొఫెషనల్ వెబ్ సైట్ ను అనువదించటము అంత తేలిక కాదు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజికి ప్రిన్సిపల్ గా ఉన్న కట్టా శేఖరరెడ్డిగారు మరియు అతని సిబ్బంది సహకారం అందించటం వలననే నొప్పిలేకుండా ప్రసవం అనే విషయం గురించి తెలుగులో సమాచారం అందించుటకు సాధ్యమైనది. ఏమి ఆశించకుండ, తెలుగు వారికి వారందించిన సహకారం, జర్నలిజం మీద వారికున్న ఆపేక్షను తెలుపుతుంది. నొప్పిలేని ప్రసవం ఎలా సాధ్యం అనే అవగాహన అన్ని వైద్యశాలలోను ఇప్పుడు లభించుటలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ వలన అది తొందరలోనే సాధ్యం కావచ్చు. ఆడవారందరికి వెబ్ చూసే సౌకర్యం ఇంకను లేకపోవచ్చు. అయితే ఈ వెబ్ సైట్ ప్రసూతి వైద్య నిపుణులకు ఉపయోగపడుతుందని, దానిని వారు గర్భస్త్రీకి విశదీకరించగలరని ఆశిస్తున్నాను.
|
This site is available in the following languages
|